భారత్లో అనాదికాలం నుంచి అద్భుతమైన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే ఎక్కడ చూసినా ఎక్కువగా దేవాలయాలు, మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో పురాతన కాలంనాటి దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. కొత్త ఆలయాలు కూడా ఎన్నో వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.  అయితే దేశంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో అత్యంత ధనిక దేవాలయంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగుతోంది.



 తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది  కాలంతో సంబంధం లేకుండా దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు  ద్రవిడ శైలిలో ఉండే ఈ ఆలయం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇకపోతే గతంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ శుభ వార్త చెప్పింది  కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇక అదే ఆలయాన్ని పోలిన దేవాలయాలను దేశవ్యాప్తంగా నిర్మించేందుకు సిద్దమయింది టీటీడీ బోర్డు.  ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్లో కూడా ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.



 జమ్మూ కాశ్మీర్లో వైష్ణో మాత దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది.  ఇక్కడికి ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు ఎన్నో ప్రముఖ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దీంతో సిటీ ఆఫ్ టెంపుల్స్ గా జమ్ము కాశ్మీర్ గుర్తింపు సంపాదించింది. అయితే ఇక్కడ తిరుమల శ్రీనివాసుని దర్శనం కల్పించేందుకు టిటిడి బోర్డు నిర్ణయించింది. కాశ్మీర్లో టీటీడీ ఆలయానికి ఇటీవలే భూమి పూజ జరిగింది. ఈ ఆలయంలో వేదపాఠశాల, ధ్యాన కేంద్రం, పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ బోర్డు తెలిపింది. కాగా ఈ భూమి పూజ కార్యక్రమం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,  జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్  పాల్గొన్నారు. 60 ఎకరాల్లో 18 నెలల్లో ఈ దేవాలయంలో పూజలు చేసేందుకు టిటిడి బోర్డు నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd