వైసీపీ ఎమ్మెల్యేల్లో హై ఓల్టేజ్ టెన్ష‌న్ క్రియేట్ అయ్యింద‌న్న‌ది నిజం. ఎవ‌రికి ఎన్ని ప‌ద‌వులు ఉన్నా ఒక్క‌సారి అయినా మంత్రి అవ్వాల‌ని.. బుగ్గ కారులో తిర‌గాల‌ని.. కోరుకుంటోన్న వారు చాలా మందే ఉన్నారు. కేబినెట్ బెర్త్ ఆశించే వారి లిస్ట్ అయితే చాంతాడంత ఉంది. ఓ 30 మంది వ‌ర‌కు సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో కొత్త‌గా ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. వీరి ఆశ ఏంటంటే తొలి సారి ఎమ్మెల్యేలు అయిన సీదిరి అప్ప‌ల రాజు, చెల్లుబోయిన వేణు మంత్రులు కాగా లేనిది తాము అయితే త‌ప్పా ? అని మ‌ధ్య వ‌ర్తుల‌తో పంచాయితీలు పెట్టుకుంటున్నార‌ట‌.

ఇక కేబినెట్లోకి వ‌చ్చేదెవ‌రు ?  పోయేదెవ‌రు ? అన్న దానిపై ఇప్ప‌టికే అంచ‌నాలు, చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. మంత్రులుగా ఉండి రాజ్య‌స‌భ‌కు వెళ్లిన పిల్లిసుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి ఎంపీలు కావడంతో.. వారి స్థానాల్లో మంత్రులుగా వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు స్థానాలు ప్రస్తుతానికి సేఫ్ అన‌డంలో సందేహం లేదు. వీరు వ‌చ్చి కొద్ది నెల‌లే అవ్వ‌డంతో జ‌గ‌న్ వీరిని మార్చ‌ర‌న్న‌ది ఖాయం. ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ యాదవ్ కు వ‌చ్చిన ఇబ్బంది కూడా లేదు.

ఇక కన్నబాబు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుగ్గన స్ధానాలు సేప్‌ అని వైసీపీ ఇంట‌ర్న‌ల్ టాక్ ?   ఉన్న 25 మందిలో 10 మంది మంత్రుల స్థానాలు సేఫ్ అయితే.. కొత్త‌గా కేబినెట్లో కి మ‌రో 15 మంది వ‌ర‌కు వ‌స్తారు. మ‌రి వీరిలో ఎవ‌రు లక్కీ ప‌ర్స‌న్స్ అవుతారో ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: