సాధారణంగా పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం అందరం. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా తక్కువగానే జరుగుతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదైనా పెద్ద కారణం ఉంటే తప్ప జరగాల్సిన పెళ్లి పీటలపై ఆగిపోదు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం చిన్న చిన్న కారణాలకే పెళ్లి పీటల పై పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇలాంటి ఘటనలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  సాధారణంగా పెళ్లికి శుభలేఖ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరికి శుభ లేఖ ఇచ్చి పెళ్లి కి ఆహ్వానిస్తూ ఉంటారు.


 బంధుమిత్రులతో పెళ్ళికి విచ్చేసి ఇక ఆశీర్వచనాలు అందించాలి అని శుభ లేఖ ఇచ్చి కోరుతూ ఉంటారు. ఇక పెళ్లి జరుగుతుంది అని చెప్పడానికి అందరికీ శుభలేఖలు ఒక కేరాఫ్ అడ్రస్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ శుభలేఖ పెళ్లి ఆగిపోవడానికి కారణం అయింది.దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగులోకి వచ్చింది. నాసిక్ కి చెందిన నగల వ్యాపారి ప్రసాద్ అద్గార్కర్ కి రసిక అనే కుమార్తె ఉంది. అయితే చిన్నప్పటినుంచి అంగవైకల్యంతో బాధపడుతుంది ఆమె. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల యువతీ మాజీ క్లాస్ మెంట్ అయిన ఆసిఫ్ ఖాన్ ఇక ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు


 కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లిని అంగీకరించారు. ఈ క్రమంలోనే మే నెలలోనే ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్లిని రిజిస్టర్ చేశారు  ఇక జూలై 18వ తేదీన ఘనంగా ఒక హోటల్ లో పెళ్లి వేడుక నిర్వహించాల్సి ఉంది  ఒక ప్రత్యేకమైన శుభలేఖ ముద్రించి ఇక బంధుమిత్రులందరికీ వాట్సాప్ ద్వారా పంపించారు. కానీ అంతలోనే అసలు సమస్య మొదలైంది. బలవంతంగా ఆ యువతిని ముస్లిం యువకుడికి కట్టబెడుతున్నారని ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ అంటూ నిరసనలు పెరిగిపోయాయి. కొంతమంది ఏకంగా యువతి తండ్రి కి ఫోన్ చేసి బెదిరించడం కూడా చేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిటీ పెద్దలు ప్రసాద్  థో సమావేశమై వేడుక నిర్వహించ వద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పెళ్లిని రద్దు చేసుకుంటామంటూ ప్రసాద్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికే పెళ్లి రిజిస్టర్ కావడంతో ఇక కోర్టుకెళ్లిన వారిద్దరూ కలిసి ఉండటానికి ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు అని అందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: