యాదాద్రి జిల్లా : వాసాలమర్రి దళితులపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ ప్రపంచం మొత్తం మీద జరిగిన దుర్మార్గాల వల్ల
దళిత జాతి అణిచి వేతకు, వివక్ష కు  గురైందని...ప్రతి ఊరిలో పేదలు దళితులేనన్నారు. అంబెడ్కర్ దళిత సమాజం కోసం ఎంతో పోరాటం చేశారని.. అంబెడ్కర్ కృషి ఫలితం గా రిజర్వేషన్లు వచ్చాయన్నారు.ఇటీవల దళిత బంధు పథకాన్ని మొదలు పెట్టామని.. దళిత బంధు పథకం వృధా కావొద్దన్నారు.  వాసాలమర్రిలో కొత్త ఇళ్లు కట్టిస్తానని.. వాసాలమర్రి లో బీసీలను ఆదుకుంటామని చెప్పారు.  గ్రామములో 76 మంది దళిత కుటుంబాలు ఉన్నాయని..16 దళిత కుటుంబాలకు అసలు భూమిలేదని చెపుతున్నారని పేర్కొన్నారు.  


వాసాలమర్రి లో కబ్జాకు గురైన భూమి లెక్కలు బయటకు తిస్తానని.. దళిత భూములు ఎక్కడున్నా ఏకీకరణ చేద్దామని వెల్లడించారు.. 15 నుంచి 16 లక్షలు దళిత కుటుంబాలు రాష్ట్రములో ఉన్నాయని.. నేను దత్తతు తీసుకోవడం వల్ల వాసాలమర్రి గ్రామస్థులు అదృష్టవంతులు అని చెప్పారు. ఈ ఊరిలో 76 దళిత కుటుంబాలకు ఈరోజే దళిత బంధు మంజూరి చేస్తున్నానని.. రేపటి నుంచి మీ అకౌంట్ లల్లో డబ్బులు జమ అవుతుందని వెల్లడించారు. దళిత బంధు డబ్బు బాధ్యత మీదేనని..  మీ వ్యాపారం..మీ ఇష్టమన్నారు.  ఆలేరు నియెజిక వర్గంలో 30 కోట్లతో దళిత రక్షణ నిధి ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

 ఆపదలో ఉన్న దళితులకు ఈ నిధి డబ్బు ఉపయోగపడుతుందని... వాసాలమర్రి గ్రామము  ఆలేరు నియోజకవర్గానికి  దారి చూపాలని పేర్కొన్నారు. దళిత బంధు రూపంలో దళితులకు మంచి అవకాశం వచ్చిందని...చదువుకున్న వారికి ఎక్కువ బాధ్యత ఉండాలన్నారు సిఎం కెసిఆర్. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది... గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్నారు. దళిత జాతి ఇప్పటికి ఎక్కడికి పోయిన పేదరికంలో వున్నారని...ప్రభుత్వాలు సరైన పంథా లో పధకాలు పెట్టకపోవడంతో దళితులు ఇంకా పేదరికంలో వున్నారని పేర్కొన్నారు. దళితులు ఐకమత్యం తో ఉండాలని..కేసులు పెట్టుకోవద్దని...అంత కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: