దీంతో ఇక ఆ కరెంట్ బిల్లు చూసి పేద మధ్యతరగతి ప్రజల గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇటీవలి కాలంలో ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనంగా మారిపోయింది. వడ్రంగి పని చేసుకుంటూ ఇక ఇంటి దగ్గరే ఉండే ఒక వ్యక్తికి ఇటీవలే అధికారులు ఇచ్చిన కరెంట్ బిల్లు మాత్రం వెన్నులో వణుకు పుట్టించింది అనే చెప్పాలి. వందల్లో వేలల్లో కాదు ఏకంగా లక్షల్లోనే కరెంట్ బిల్లు వేశారు విద్యుత్ అధికారులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం కి చెందిన లింగా చారి వడ్రంగి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇంటివద్దే పనులు చేసుకుంటూ ఉంటాడు అయితే ప్రస్తుతం కరోనా సమయంలో పనులు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇక ఇంటి వద్ద వడ్రంగి పని చేస్తే లింగా చారి కి ప్రతినెల 1500 నుంచి 2000 వరకు కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఇక రీడింగ్ చెక్ చేసి లింగా చారి కి కరెంటు బిల్లు ఇచ్చారు. ఇక ఎప్పటిలాగే 2000 వచ్చి ఉంటుందిలే అని లింగా చారి ఆ కరెంటు బిల్లు వైపు చూశాడు. కానీ అందులో ఏకంగా ఆరు లక్షల 74 వేల 900 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు లింగ చారి. విద్యుత్ అధికారుల వద్దకు పరుగులు తీశాడు. అయితే మీటర్లలో తప్పిదం వల్ల ఇలా జరిగి ఉంటుందని వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఏఈ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి