వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ వైపు.. ఒక వేలు చూపిస్తున్న బీజేపీ నాయ‌కులు, బీజేపీ అనుకూల మీడియాకు సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. కొన్ని రోజులుగా.. జ‌గ‌న్ స‌ర్కారును బ‌ద్నాం చేసే క్ర‌మంలో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతూ.. బీజేపీ నేత‌లు తీవ్ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. జీవీఎల్ న‌ర‌సింహారావు.. వంటివారు ఏకంగా ఢిల్లీ వేదిక‌గా.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అప్పుల కుప్ప‌గా రాష్ట్రాన్ని మారుస్తున్నార‌ని.. ఇన్ని అప్పులు చేస్తున్న రాష్ట్రం ఎక్క‌డా లేద‌ని కూడా జీవీఎల్ చెబుతున్నారు.

ఇక‌, సోము వీర్రాజు కూడా.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అప్పులు చేసేస్తోంద‌ని.. కేంద్రం ఒక‌వైపు ఇస్తున్న నిధుల‌ను వేరే వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని.. అందుకే జ‌గ‌న్ స‌ర్కారుపై చ‌ర్యలు తీసుకోవాల‌ని తాము కూడా కేంద్రాన్ని కోరుతున్నామ‌ని.. సోము ప్ర‌క‌టిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విష‌యంపై నెటిజ‌న్లు.. బీజేపీ పై వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మీరు ఒక‌వేలు జ‌గ‌న్ వైపు చూపిస్తున్నారు బాగానే ఉంది. కానీ, కేంద్రంలో వ‌రుస‌గా అధికారం చేప‌ట్టిన‌.. బీజేపీ స‌ర్కారు కూడా అప్పులు చేస్తోంది క‌దా.. మ‌రి సుద్దులు అక్క‌డ కూడా చెబితే బాగుంటుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల ప‌ర్య‌వ‌సానం .. బీజేపీకి బాగానే త‌గులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

దీంతో ఇప్పుడు బీజేపీ వ్యూహం మార్చింది. సోష‌ల్ మీడియాను వైసీపీ మేనేజ్ చేస్తోంద‌ని.. అందుకే త‌మ‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని.. అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తే.. త‌ప్పేంట‌ని అంటున్నారు. అయితే.. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌క‌పోయినా కేంద్రంలోని బీజేపీ కూడా అప్పులు చేస్తూ.. దేశాన్ని ఏలుతున్న‌ప్పుడు.. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క‌టే అప్పులు చేస్తున్న‌ట్టు ఎందుకు ప్ర‌చారం చేస్తున్నార‌నేది సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. అంతేకాదు.. బీజేపీ పాలిత‌.. క‌ర్ణాట‌కలోను, యూపీలోను.. కూడా ప్ర‌భుత్వాలు అప్పులు చేస్తున్నాయ‌ని. వాటి విష‌యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పార‌ద‌ర్శ‌క‌త లేని.. పార్టీగా.. బీజేపీ నిలిచిపోతుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిని కూడా వైసీపీ కుట్రే అంటారేమో.. బీజేపీ నేత‌లు.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: