ఏపీలో వైసీపీపై అసంతృప్తి మొదలయినట్టే ఉంది. దీనికి చాలానే ఉన్నప్పటికీ అభివృద్ధి జరగడం లేదన్నది ప్రధానమైన అంశంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మాట. అంతే కాకుండా సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెడుతున్నారనే అపవాదు ఉంది. ఇలా కాస్త వ్యతిరేకత వైసిపిపై ఉంది. ఇదే అదునుగా తీసుకుని ఏపీ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదని జనసేనకు పొలిటికల్ వర్గాలు సలహాలు ఇస్తున్నాయి. మొదటి నుండి కూడా జనసేనాని ఏదైనా ఒక అంశంపై పోరాడితే దాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నారు. తద్వారా ప్రజలు కూడా పెద్దగా జనసేన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఏదైనా సమస్యపై గళం ఎత్తితే లేదా నిరసన చేపడితే దానిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

ప్రస్తుతం ఏపీలో ప్రధాన సమస్యలుగా ఉన్న వాటిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గట్టిగా ఉద్యమిస్తే ఉపయోగం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఇది తెలుగు ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఒక ప్రణాళిక ప్రకారం పోరాడితే ప్రజల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో అన్ని పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నందుకు ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.

ఢిల్లీ పెద్దల్లో సైతం చలనం వస్తుంది. ఇంతకు ముందులా ఒకటి రెండు రోజులకు ఈ పోరాటాన్ని పరిమితం చేయకుండా... సుదీర్ఘ కాలంగా ఏదో ఒక విధంగా కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ఇది చాలా మంచి అవకాశం అటు వైసీపీ మరియు టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలకు ప్రత్యామ్నాయంగా  మేమున్నాం అని తెలియచెప్పాలి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి జనసేనాని ఏ విధంగా తన రాజకీయ ప్రణాళికలను చేస్తాడో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: