కోవిడ్-19 రోగులలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని గుండె, తదితర ప్రధాన భాగాలపై కరోనా ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో గత అధ్యయనాల్లో తేలింది. అయితే తాజా అధ్యయనంలో మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, కరోనా వైరస్ బారినపడి తేలికపాటి లక్షణాలతో బాధపడిన వారిలో కూడా మేధాశక్తి ఆందోళనకర స్థాయిలో దెబ్బతింది. మంచి కాగ్నిటివ్ సామర్థ్యం ఉన్న వారిలో కాగ్నిటివ్ లోపాలకు కోవిడ్-19 వ్యాధి దారి తీసింది. చదవడం, బైక్ నడపడం, విషయాలను గుర్తుంచుకోవడం వంటి చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితికి కరోనా దారితీసింది.

మార్చి 2020లో న్యూయార్క్ కి చెందిన 32 ఏళ్ల ఫ్రీలాన్స్ డేటా శాస్త్రవేత్త హన్నా డేవిస్ కోవిడ్-19 బారిన పడ్డారు. అయితే ఆమెలో కనిపించిన ఆమె మొదటి లక్షణం పొడిదగ్గో లేదా జ్వరమో కాదు. ఆమెలో కనిపించిన తొలి లక్షణం ఫ్రెండ్ పంపించిన టెక్స్ట్ మెసేజ్ చదవలేకపోవడం. మొదట్లో అలసటగా ఉన్నానని అందుకే మెసేజ్ చదవలేకపోయానని భావించిన ఆమె ఆ తరువాత కరోనా వల్ల ఇలా జరుగుతుందని తెలుసుకున్నారు. రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ఆమె చాలా ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం ఆమె షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో రోజులో కొద్ది గంటల కంటే ఎక్కువ సేపు పని చేయలేక పోతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు శాశ్వతంగా ఉంటాయా లేక కొంత సమయం తర్వాత తగ్గిపోతాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో 50% మంది కరోనా రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని తేలింది. మెదడు వాపు, మెదడులోని రక్త కణాలు గడ్డ కట్టడం వంటి అనారోగ్య సమస్యలను ఎంఆర్ఐ స్కాన్ ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు.
రేడియాలజిస్ట్ అర్షిద్ అజారిన్ వైద్య బృందంతో పరిశోధకులు కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో అక్టోబర్ 29, 2020న పారిస్ సెయింట్-జోసెఫ్ ఆసుపత్రిలో ఒక రోగి మెదడుని స్కాన్ చేశారు. ప్రస్తుతం ఆ రోగి స్కాన్ కి సంబంధించిన ఫోటో ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: