టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జ్ లు లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కొంద‌రు నేత‌లు పార్టీని వీడిపోయారు. ఈ నేత ల్లో కొంద‌రు వైసీపీలోకి.. ఇంకొంద‌రు బీజేపీలోకి వెళ్లారు. కొంద‌రు యాక్టివ్ గా ఉండ‌డం లేదు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ముందుకు న‌డిపించే నాథుడే లేకుండా పోయారు. దీంతో చంద్ర‌బాబు కాస్త మేలుకుని ఇప్ప‌టి నుంచే అక్క‌డ పార్టీని ప‌టిష్టం చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్‌చార్జ్ ను నియ‌మించుకుంటూ వ‌స్తున్నారు.

కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇన్ చార్జ్ లు లేకుండా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. జిల్లా కేంద్ర‌మైన ఏలూరు లో మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి మ‌ర‌ణం త‌ర్వాత అక్కడ ప‌గ్గాలు ఆయ‌న సోద‌రుడు బ‌డేటి చంటికి ఇవ్వ‌గా.. ఆయ‌న అక్క‌డ పార్టీని ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. తాడేప‌ల్లిగూడెంలో టీడీపీ కొత్త ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన వ‌ల‌వ‌ల బాబ్జీ అక్క‌డ అస‌లు పార్టీని గాడిలో పెడ‌తారా ? అన్న సందేహాలు ఉండేవి. అయితే ఆయ‌న జ‌న‌సేన తో క‌లిసి స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఫీచ‌మ‌ణిచారు.

న‌ర‌సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడు పార్టీని న‌డిపించ లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నీటి సంఘం ప్రెసిడెంట్ రామ‌రాజుకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. అక్క‌డ ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద రాజు ఉన్నారు. ఈ కోణంలోనే అదే వ‌ర్గానికి చెందిన రామ‌రాజుకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. ఇక కొవ్వూరులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ ఇన్ చార్జ్ లేక‌పోయినా అక్క‌డ మాజీ మంత్రి కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డం దాదాపు ఖ‌రారు కానుంది.

ఇక మ‌రో ఎస్సీ రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన చింత‌ల‌పూడి పార్టీ ప‌గ్గాల కోసం ముగ్గురు నేత‌లు పోటీ ప‌డుతున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రికి బాబు చోటు ఇస్తారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: