తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షను మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలోని అంబేద్కర్, బాబు జగజ్జివన్ రావు, మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసిన ఈటెల రాజేందర్ మహా దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉంది అన్నారు. కానీ యూనివర్సిటీ ల్లో  ఉన్న ఈ పువ్వులు వికసించడం లేదు వాడి పోతున్నాయి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో పాలకులు ఆలోచించాలి. ఎన్నికలు అధికారం కోసం తీసుకున్న నిర్ణయాలు యువతను బలి చేస్తున్నాయి. దళితులకు దళిత బంధు అనే కత్తి ఇచ్చి ఈటల రాజేందర్ను పొడిచి  చంపండి అని పంపిస్తున్నారు.

వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఆత్మగౌరవ పోరాట ప్రయాణం కూడా మొదలైంది. ఇక మీరంతా కలిసి రండి దీనికి ఈ యూనివర్సిటీ నే కేంద్ర బిందువు కావాలని పిలుపునిచ్చారు. ఇక అదే విధంగా 2009లో కేసీఆర్ దీక్ష విరమణ చేసినప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని కొనసాగించవల్సిందే అని గేట్ నెంబర్ 2 వద్ద దీక్ష బూనారు. సమిష్టి పోరాటం చేశారు. సమైక్య పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారని నాటి సంఘటనను గుర్తు చేశారు. అదేవిధంగా ఇడ్లీ,  సాంబార్ గో బ్యాక్ అంటూ 69 ఉద్యమాలు ఉద్యోగాల కోసం జరిగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షియూనివర్సిటీ మాజీ వీసీ, మనందరి మార్గదర్శకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన కలలుగన్న ఉద్యోగాలు లేవు. పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రావు ఆశయాలు అమలు కావడం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ఊసేలేదు. విశ్వవిద్యాలయాలు, చైతన్య కేంద్రాలు దోపిడీలకు,  అక్రమాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడే కేంద్రాలు. ఇక్కడ చదువుతున్న వారికి సైతం ఉపాధి లేదు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకుండా పోయాయని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి ఉన్న దేశమే గొప్ప దేశం అని పేర్కొన్నారు. ఒకప్పుడు పిల్లల్ని సమాజ ఆస్తిగా భావించిన సమాజం నేడు భారంగా భావిస్తోంది. మానవ సంపద, దేశ సంపద ప్రజల ఆకలి తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం ఇచ్చే నిర్ణయాలు జరగడం లేదు.

పాలకులు ప్రజల కోసం కాదు, పదవుల కోసం ఇస్తున్న రాయితీలు ఈ పథకాలు అని, 40 ఏళ్ల క్రితం చదువుకున్నాము. కానీ హుజురాబాద్ లో నిజమా అని నిరూపితమైందని  చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. అంబేద్కర్ కి దండ వేయని కెసిఆర్ జై భీమ్ అన్నారు. అంటే అది దళితుల మీద ప్రేమ కాదు, దళిత ఓట్ల కోసం. దళిత బందు  కూడా ఓట్లను కొల్లగొట్టడం కోసమే. దళితులకు దళిత బంధు అనే కత్తి ఇచ్చి ఈటల రాజేందర్ ను పొడిచి చంపాలని పంపిస్తున్నాడు. ఈ జాతి బాగుపడాలి అనే సోయి కేసీఆర్ కు  లేదు. అదే ఉండి ఉంటే రాష్ట్రమంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దళిత బందును ప్రారంభించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: