ఏపీ రాజ‌కీయాల్లో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఎంత‌లా ప్ర‌భావం చూపిస్తాయో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ కులాల‌దే రాజ్యం. కులాలే గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌ధానంగా డిసైడ్ చేస్తాయి. ఏపీలో ఉన్నంత కుల కంపు ద‌క్షిణా ది రాష్ట్రాల లో మ‌రెక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌దు. ఇక ఏపీలో ముఖ్యంగా క‌మ్మ , రెడ్డి సామాజిక వ‌ర్గాలే కొన్ని ద‌శాబ్దాలుగా రాజ్య మేలుతున్నాయి. అయితే వీరి ఓటింగ్ శాతం చాలా త‌క్కువ‌. అయినా కూడా వీరు రాజ్యాధికారం అనుభ‌విస్తున్నారు. ఈ రెండు కులాల కంటే మ‌రో అగ్ర వ‌ర్ణం అయిన కాపులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే వీరికి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్యాధికారం రాలేదు. చివ‌ర‌కు ఉమ్మ‌డి స్టేట్ ఉన్న‌ప్పుడు ఎస్సీ వ‌ర్గానికి చెందిన దామోద‌రం సంజీవ‌య్య సైతం ముఖ్య‌మంత్రి అయ్యారు. కాపు  , బీసీ వ‌ర్గాల నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ ముఖ్య‌మంత్రులు కాలేదు.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తోన్న చ‌ర్య‌లు, తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో ఆ పార్టీకి కాపులు, బ్రాహ్మ‌ణ వ‌ర్గాలు దూర‌మ‌వుతాయ‌న్న సందేహాలు అయితే వ‌స్తున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో వైసీపీ త‌ర‌పున శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారున్నారు. జగ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఇప్ప‌టికే ఈ కార్పొరేష‌న్‌కు ఇద్ద‌రు చైర్మ‌న్ల‌ను మార్చేశారు.

ఈ వ‌ర్గం ఎప్పుడూ గ‌తంలో వైఎస్ ఇప్పుడు జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీరంతా జ‌గ‌న్ తీరుపై మండి ప‌డుతున్నారు. అస‌లు బ్రాహ్మణ సామాజికవర్గాన్ని వెనకబడిన తరగతుల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఈ కార్పొరేష‌న్ ను బీసీ కార్పొరేష‌న్లో చేర్చ‌డంతో అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇక ఇటీవ‌ల ప‌రిణామాల నేప‌థ్యంలో కాపులు కూడా క్ర‌మ క్ర‌మంగా వైసీపీ కి ,  జ‌గ‌న్ కు దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి ఉంది.

అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాపు నేత‌లు, మంత్రుల‌తో టార్గెట్ చేయిస్తున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల ఊసే లేదు. దీంతో కాపుల్లో కూడా ఆలోచ‌న అయితే స్టార్ట్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల‌లో వీరంతా జ‌గ‌న్‌కే స‌పోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు వీరు కూడా దూరం అవుతున్నారు. మ‌రి జ‌గ‌న్ వీరిని మ‌రింత దూరం చేసుకుంటారా ?  పంథా మార్చుకుంటారా ? అన్న‌ది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: