యుద్ధం సద్దుమణిగాక వైసీపీ నేతలకు ఊపు వస్తుందని, ఎలాంటి కారణం లేకుండా పవన్ కల్యాణ్‌ని తిడుతున్నారని, ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ లాగా ఉందని జనసైనికులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల పవన్ కల్యాణ్-వైసీపీ నేతల మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో విమర్శించారు. అదే క్రమంలో ఎప్పుడూలేని విధంగా మంత్రులని తిట్టారు. మామూలుగానే వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతారో అందరికీ తెలుసు. ఇక పవన్ తిట్టాక వారు ఎందుకు ఊరుకుంటారు. వారు కూడా నాలుకు తిట్లు ఎక్కువ తిట్టారు.
పవన్ ఏమన్నా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే చాలు...వైసీపీ నుంచి తిట్లే సమాధానంగా వచ్చాయి. అంతలా పవన్-వైసీపీల మధ్య రచ్చ జరిగింది. అయితే ఆ రచ్చ ఇప్పుడుప్పుడే సద్దుమణుగుతుంది. పవన్ కూడా మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో అకారణంగా భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్....పవన్‌పై తిట్లు పురాణం ఎత్తుకున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన కార్యక్రమంలో పవన్ పేరు తీసుకొచ్చి మరీ తిట్టారు.
పవన్ కల్యాణ్... జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారని, మనకు తెలిసి పవన్‌కు ముగ్గురు భార్యలు... తెలియకుండా ఎంత మంది ఉన్నారో! అని పర్సనల్ విషయాలు మాట్లాడారు ఓ మంత్రిని సన్నాసి అని వ్యాఖ్యానించిన పవనే సన్నాసిన్నర సన్నాసి అని ఫైర్ అయ్యారు. అయితే ఇలా గ్రంథి సడన్ ఎటాక్ వెనుక కారణాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అమలవుతుందని, వైసీపీ నేతలు అదే ఫాలో అవుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
అదే సమయంలో కాపు కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని గ్రంథి చూస్తున్నారు. అందుకే పవన్‌ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సారి మంత్రి వర్గంలో తాను చోటు దక్కించుకోవడానికి గ్రంథి ప్రయత్నిస్తున్నారు...అందుకే పవన్‌పై సడన్ ఎటాక్ చేసినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి