2019 ఎన్నికల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏది కలిసి రావడం లేదనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి పరిస్తితి మారిపోయింది. ఎప్పటికప్పుడు టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు కష్టపడుతూనే ఉన్నారు...కానీ అధికారంలో ఉన్న జగన్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎన్ని రకాలుగా చంద్రబాబని అణిచివేయాలో అన్నిరకాలుగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అధికార వైసీపీ రాజకీయం ఉంటుంది.... సామ దాన భేద దండోపాయాలని ప్రయోగిస్తూ టీడీపీకి చెక్ పెడుతుంది. దీంతో రాజకీయంగా పికప్ అవ్వలేని పరిస్తితి టీడీపీకి ఉంది. అలా అని ప్రజల్లో వైసీపీకి ఏమి అంతా పాజిటివ్ లేదు. కానీ టీడీపీకి ప్లస్ కూడా లేదు అన్నట్లుగా పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి నుంచి బయటపడేందుకు బాబు...శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎక్కడకక్కడ జగన్ రాజకీయాన్ని తట్టుకుని నిలబడుతూనే ఉన్నారు.

ఒకవేళ చంద్రబాబు కంటే మరొక నాయకుడైతే జగన్ దెబ్బకు ఎప్పుడో దుకాణం మూసుకునేవారని చెప్పొచ్చు. కానీ చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా పోరాడుతూనే ఉన్నారు. అయితే సోలోగా జగన్‌ని రాజకీయంగా ఎదురుకోవడం బాబుకు కాస్త కష్టమే అని చెప్పాలి...అందుకే రాష్ట్రంలో పవన్ కల్యాణ్ సపోర్ట్ అడుగుతున్నారు. అప్పుడు జగన్‌ని ధీటుగా ఎదురుకోవచ్చు. పవన్‌కు ఎలాగో సింగిల్ గా సత్తా చాటే ఛాన్స్ లేదు. కాబట్టి బాబుతో కలిస్తే కాస్త బలపడొచ్చు.

అదే సమయంలో ఈ ఇద్దరికీ బీజేపీ సపోర్ట్ ఉండాలి...అది రాష్ట్రంలోని బీజేపీ కాదు...కేంద్రంలోని బీజేపీ.. అప్పుడే కాస్త వైసీపీకి చెక్ పెట్టగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ వల్ల పావలా ఉపయోగం లేదు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు సపోర్ట్ ఉంటే పరిస్తితి వేరుగా ఉంటుంది. 2019 ఎన్నికల ముందు బీజేపీ పెద్దలతో బాబు కయ్యం పెట్టుకుని ఎంత నష్టపోయారో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పటికైనా కాస్త బీజేపీ పెద్దలకు దగ్గరైతే బాబుకు బెటర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: