ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయినట్లు ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్తితి...తాజాగా ఏపీలో ఎలాంటి రాజకీయం నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రచ్చ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగా బాబు కాస్త వ్యూహాలు మార్చి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులకు నిరసనగా అదే పార్టీ ఆఫీసులో 36 గంటల పాటు దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దీక్ష ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు.

ఇక వైసీపీ పాలన ఎలా ఉందనే విషయాన్ని ఢిల్లీ స్థాయిలో హైలైట్ చేయాలని చంద్రబాబు ట్రై చేశారు. దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అటు సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది...అయితే చంద్రబాబు, ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలని సైతం కలవాలని అనుకున్నారు. వారి అపాయింట్‌మెంట్ల కోసం కూడా ట్రై చేశారు. అందుకు ఢిల్లీలోనే రెండు రోజులు మకాం వేశారు.

కానీ బాబుకు అంతా రివర్స్ అయింది...మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్ బాబుకు దొరకలేదు. దీంతో బాబు హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే గతంలో సీఎంగా ఉండగా...బాబు ఊరికే అపాయింట్‌మెంట్లు దొరికేవి...కానీ ఇప్పుడు పరిస్తితి మరీ దారుణంగా తయారైంది. ఎప్పుడైతే బాబు... బీజేపీ నుంచి బయటకొచ్చి మోడీ, అమిత్ షాలని తిట్టారో అప్పటినుంచే పరిస్తితి మారిపోయింది.

ఆ తర్వాత నుంచి ఇద్దరి నేతలని బాబు ఇంతవరకు కలవలేదు. ఇప్పుడు కలవాలని ట్రై చేసిన అపాయింట్‌మెంట్స్ దొరకలేదు. ఇక భవిష్యత్‌లో దొరకడం కష్టమనే చెప్పాలి. మళ్ళీ బాబుని కలవడానికి మోడీ, అమిత్ షాలు పెద్దగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. మొత్తానికి బాబు ఒక గల్లీ లీడర్ నాయకుడుగా అయిపోయారు. ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు, పరిస్తితి ఇలా అయిపోతుందని ఎవరూ  ఊహించలేదనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: