అయితే ఈటెల ఇక్కడ ఓడిపోతాడు అనడానికి ఏ ఫ్యాక్టర్స్ కారణం అవుతాయో చూద్దాం.
* ఈటెల మనసులో కేసీఆర్ ను ఓడించాలని మాత్రమే ఉంది. తద్వారా ప్రజల మనసును గెలుచుకోవడం కోసం ఏమి చెయ్యాలో తెలియడం లేదు.
* అయితే దేశ వ్యాప్తంగా బీజేపీకి ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో తెలిసిన విషయమే. అలాంటిది ఈటెలను ప్రజలు స్వాగతిస్తారా అన్నది అనుమానమే.
* పైగా ప్రచారం సమయంలో ఈటెలకు బీజేపీ పెద్దల నుండి సరైన సహకారం అందలేదు. కేంద్రం నుండి కొందరు పెద్దలు వచ్చి ప్రచారంలో పాల్గొంటామని చెప్పినా ఎందుకో అది జరగలేదు. బీజేపీ వాళ్ళే గెలిచేది కేసీఆర్ అని డిసైడ్ అయిపోయారా అన్నది తెలుస్తోంది.
* ఈ ఎన్నికల కోసం ఒక వైపు తెరాస కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. బీజేపీ వైపు చూస్తే ఆ స్థాయిలో ఖర్చు పెడుతుందా అన్నది సందేహమే. ఒక ఓటరు ఎన్ని మాటలు చెప్పినా చివరికి డబ్బుకు లోంగిపోతాడు..ఈ విషయంలో తెరాస ముందంజలో ఉంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ బీజేపీ శ్రేణులు మళ్ళీ దుబ్బాక ఉప ఎన్నిక రెసుల్త్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరు తెలుసుకోవాల్సింది అక్కడ పరిస్థితులు వేరు...ఇక్కడ వేరు. పైగా తెరాస అభ్యర్థి విషయంలోనూ పొరపాట్లు చేయడంతో దుబ్బాకలో తెరాస ఓటమి పాలైంది.
* ప్రచారం సమయంలో బీజేపీ నాయకుడు హుజురాబాద్ ముస్లిం ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది.
మరి ఇన్ని ప్రతికూలతలు మధ్య ఈటల ఇంకా గెలుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అది కేవలం వారి యొక్క అమితమైన విశ్వాసం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి