ఇక మరో అడ్డంకి కూడా ఆళ్లకు ఉంది. అదేంటంటే ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో లోకేష్ మీద ఆళ్ల పోటీ చేసిన క్రమంలో లోకేష్ పై గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి. ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఇచ్చారు. మరో వైపు ఆళ్ల కు కూడా తనకు ఈ సారి అయినా మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పోతున్నాయి.
అయితే ఆళ్ల అనుచరులు మాత్రం జగన్ తమ నేతకు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టు బడుతున్నారు. అయితే జిల్లాలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో కమ్మ వర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. ఇక మర్రి తో పాటు అంబటి రాంబాబు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - ముస్తాఫా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఏదేమైనా ఆళ్ల కు జగన్ మంత్రి పదవి హామీ ఇచ్చి కూడా పదవి ఇవ్వలేని విచిత్ర పరిస్థితి నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి