టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పనితీరు విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్తా సంతృప్తిగా ఉన్నారని ప్రచారం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చెన్నాయుడు వ్యవహార శైలి సరిగా లేదు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉన్న సరే ఆయన సమర్థవంతంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడం లేదని చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి.

అదేవిధంగా కొన్ని కొన్ని పదవుల విషయంలో ఆయన దూకుడుగా ముందుకు వెళ్లి కొంత మంది సన్నిహితంగా ఉండే వాళ్లకు అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారు అనుకుంటే వాళ్ల గురించి ఎవరైనా మంచి చెప్తే చాలు వాళ్ళకి ఏదైనా పదవి ఇవ్వడానికి ఆయన వెనకడుగు వేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ వ్యవహారాల విషయంలో గత కొన్ని రోజుల నుంచి అచ్చెన్నాయుడు పట్టు కోల్పోయారనే భావన కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో రాబోయే ఫలితాలు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరికలు కూడా ఉన్నాయి.

టిడిపిలో కీలక నాయకులు ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం వాస్తవం. కానీ దీన్ని పరిష్కరించే విషయంలో మాత్రం ఆయన వెనకడుగు వేయడం పట్ల పార్టీ నాయకత్వంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కీలక నాయకులను ఈ మధ్యకాలంలో దగ్గర చేసుకునే విషయంలో ఆయన సమర్థవంతంగా లేరని అలాగే ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకునే అంశాన్ని కూడా పెద్దగా పరిశీలిం చడం లేదని కాంగ్రెస్ నుండి కొంతమంది నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆయన సమర్థవంతంగా లేరని ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: