ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను  భారీ వర్షాలు ముంచెత్తాయి అన్న విషయం తెలిసిందే. దీంతో వరదల కారణంగా భారీగా నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంవరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు  ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యలు కూడా చేపడుతుంది. ఇలాంటి సమయంలోనే ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్కు విపత్తులపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతటి దుస్థితి ఉంది అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు.


 కాగా ఇటీవల జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విమర్శలపై అటు వైసిపి నేతలు కౌంటర్ ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ విషయంపై ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వరద బాధితుల వద్దకు వెళ్లి బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు రోజా. చంద్రబాబు  14 ఏళ్ల పాలనలో వచ్చిన తుఫాను లలో ఎంత మంది కి కోటి రూపాయలు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన తుఫానులు ఎంతమందికి పరిహారం అందింది అంటూ ప్రశ్నించారు.. తుఫాను బాధితుల దగ్గరికి వెళ్లి అసెంబ్లీలో జరిగింది చెబుతావా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా.



 కుప్పంలో ఓటమితో చంద్రబాబుకు పిచ్చి ఎక్కిందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ముఖ్య మంత్రిని పట్టుకొని గాల్లోనే పోతావ్ అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏరియల్ సర్వే చేయడం తప్ప అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు చేస్తున్నది మొత్తం డ్రామా అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు వరదలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అంటూ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు శాడిజం తో ఉన్నాడు.. జగన్ రాజకీయాల్లో ఉన్నంత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు అంటూ రోజా జోస్యం చెప్పారు. ఒకప్పుడు సోనియా చిదంబరం కాళ్లు పట్టుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ రోజా విమర్శలు గుప్పించారు.. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయాలు ఆడుకోవడం అంటే అది చంద్రబాబుకే చెల్లుతుంది. సభలో పాల్గొనడానికి భయం వేసి సభ నుంచి చంద్రబాబు పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రోజా. నన్ను అసెంబ్లీలో ఇబ్బంది పెట్టిన రోజు నేను మహిళ అన్న విషయం నీకు గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: