త‌న దాకా వ‌స్తే.. త‌ప్ప‌.. సెగ తెలియ‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు. ఈ మాట ఎవ‌రో .. అన డం లేదు. టీడీపీలోనే బ‌హిరంగంగా వినిపిస్తున్న మాట‌. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. చాలా మంది నాయ కులు ఇదే మాట అంటున్నారు. ``గౌర‌వ స‌భ‌ల‌తో ఏం సాధిస్తాం. మా పాల‌న‌లో ఏమైనా.. త‌క్కువ చేశామా?  మావాళ్లు త‌ప్పులు చేసిన‌ప్పుడు.. చంద్ర‌బాబు అదుపు చేశారా?`` అని సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్నారు. సింప‌తీ రాజ‌కీయాలు అన్ని వేళ‌లా సాగ‌వ‌ని చెబుతున్నారు. వైసీపీ నాయ‌కురాలికి గుండి కొట్టిస్తాన‌ని మా ఎమ్మెల్యే ఒక‌రు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు..చంద్ర‌బాబు ముసిముసిగా న‌వ్వుకున్నారు.

అప్ప‌ట్లో మ‌హిళ‌ల‌కు గౌర‌వం.. మ‌హిళ‌ల ప‌ట్ల మ‌ర్యాద ఇవ్వాల‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌రిచిపోయా రా? ఓ మ‌హిళా ఎమ్మార్వోను.. మా కార్య‌క‌ర్త‌లు ఇసుక రీచ్‌లోనే కొట్టారు. అప్పుడు.. క‌నీసం ఖండించారా?  అప్పుడు ఏమైంది మ‌హిళ‌ల గౌర‌వం. నిండు స‌భ‌లో ఏడాదిపాటు ఒక మ‌హిళా శాస‌న స‌భ్యురాలిపై ఏడాది పాటు వేసిన‌ప్పుడు.. మ‌హిళ‌ల‌కు ఇదే ప్ర‌జాస్వామ్య సౌధం అన్యాయం చేస్తున్న‌ద‌నే విష‌యం మ‌రిచిపోయారా?  పోనీ.. ఒక మ‌హిళా ఎస్సీ మంత్రి.. మ‌న పార్టీకే చెందిన నాయ‌కురాలిని.. క‌నీసం చెప్ప‌కుండానే.. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్పుడు.. మ‌హిళ‌ల‌కు మ‌ర్యాద ఇచ్చిన‌ట్టు చెప్పుకోల‌గమా?

ఇవ‌న్నీ.. ఇలా ఉంటే.. సొంత కుటుంబానికి చెందిన మ‌హిళా నేత‌.. పొరుగు రాష్ట్రంలో ఓడిపోతే.. ఏపీలో అయినా.. ఆమెను ఆద‌రించారా?  అప్పుడు మ‌హిళ అనే విష‌యం మ‌రిచిపోయామా? గ‌తంలో ఒక రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విని అలంక‌రించిన ఎస్సీ మ‌హిళ‌.. త‌న‌కు రాజ‌కీయంగా గుర్తింపు ఇవ్వాలంటూ.. వేడుకుంటే.. ఆమెను ప‌ట్టించుకున్నామా? .. ఇప్పుడు మ‌నకు మ‌హిళ‌ల గురించి మాట్లాడే అర్హ‌త ఎక్కడుంది? అని త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జాస్వామ్య సౌధంలో ఇప్పుడు అధికార పార్టీ నేత‌లు నోరు పారేసుకుంటున్నార‌ని చెబుతున్న మ‌నం.. గ‌తంలో ఏం జ‌రిగిందో మ‌రిచిపోతే ఎలా సార్ అంటున్నారు.

అరెయ్‌.. ఒరేయ్‌! అని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ఎమ్మెల్యే నోరు పారేసుకుంటే.. అదే నిండు స‌భ‌.. ప్ర‌జాస్వామ్య సౌధం.. ఆనాడు ఆనందించిందిగా సార్‌!!  ఇప్పుడు మ‌న‌కు మాట్లాడే అవ‌కాశం లేద‌ని.. చెబుతున్న ప‌లుకులు.. ఆనాడు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి ఎంత చ‌క్క‌గా మాట్లాడే అవ‌కాశం ఇచ్చామో.. తెలుసుకుంటే.. ఏమ‌య్యాయ‌ని.. అంటున్నారు. అప్ప‌ట్లో స్పీక‌ర్‌గా ఉన్న నాయ‌కుడు.,. స‌భ‌లో పార్టీల‌కు ఉన్న స‌భ్యుల సంఖ్య‌ను బ‌ట్టి మైక్ ఇస్తామ‌ని.. మ‌న‌మే చెప్పించాం. మ‌రి ఇప్పుడు.. మ‌న సంఖ్యాబ‌లం ఎంత‌?  మ‌రి దీనిని బ‌ట్టి అస‌లు మ‌న‌కు మైక్ ఇవ్వాలా?  వ‌ద్దా? మన‌కు తెలియ‌దా!! అన్నీ తెలిసి.. ఇప్పుడు.. యాగీ చేసుకోవ‌డం.. మ‌న‌కే బూమ‌రాంగ్ అవుతుంది సార్‌!! అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: