ఏదేమైనా రాజధాని అమరావతి అంశం వైసీపీకి సైలెంట్‌గా డ్యామేజ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏదో ఇప్పుడు అధికార బలం ఉంది కాబట్టి...అమరావతి ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు...కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే కాస్త మార్పు వస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతికి బ్రేక్ వేసి...జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంటూ కాలం గడుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆ మూడుకు దిక్కు లేకుండా పోయింది. అలా అని అమరావతిని కొనసాగిస్తామని చెప్పడం లేదు.

ఈ పరిస్తితులని చూస్తే...రాజధాని అంశం వైసీపీ కొంపముంచేలా ఉంది. ముఖ్యంగా అమరావతికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి డ్యామేజ్ ఎక్కువే జరిగేలా కనిపిస్తోంది. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అదే రుజువైంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ సత్తా చాటింది. వైసీపీకి చెక్ పడింది. ఇప్పుడే ఇలా ఉందంటే...ఎన్నికల నాటికి ఇంకా పరిస్తితి ఎలా మారుతుందనేది డౌట్‌గా ఉంది.

అప్పుడు వైసీపీ ఇంకా గడ్డు పరిస్తితులు ఎదురుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో వైసీపీకి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా నగరంలో వైసీపీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. నగరంలో తూర్పు సీటుని టీడీపీ గెలుచుకుంటే..కేవలం 25 ఓట్లతో సెంట్రల్ సీటుని వైసీపీ గెలుచుకుంది. ఇక వెస్ట్‌లో వైసీపీ జెండా ఎగిరింది. అటు ఎంపీ సీటు టీడీపీ ఖాతాలో పడింది.

ఇక రెండున్నర ఏళ్ల తర్వాత విజయవాడ నగరంలో రాజకీయం ఎలా ఉందనేది గమనిస్తే...అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి అంతా అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వైసీపీపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశాలు టీడీపీకి కలిసొచ్చేలా ఉన్నాయి. తూర్పులో వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గట్టిగానే కష్టపడుతున్నారు గానీ, ఆయనకు రాజధాని అంశం మైనస్ అయ్యేలా ఉంది. అటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. కాబట్టి బెజవాడలో మూడు సీట్లలో వైసీపీ గెలుపు డౌటే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: