ఏపీ రాజకీయాలపై జేసీ, కోట్ల, నల్లారి ఫ్యామిలీల ఎలాంటి చెరగని ముద్ర వేశారో అందరికీ తెలిసిందే. రాయలసీమకు చెందిన ఈ బడా ఫ్యామిలీలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అలాగే అనేక పదవులు అనుభవించారు. ఇందులో నల్లారి, కోట్ల ఫ్యామిలీల నుంచి ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు...ఉమ్మడి ఏపీ సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు.

ఇలా కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన ఈ మూడు బడా ఫ్యామిలీలు ఇప్పుడు టీడీపీలో రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని క్లోజ్ కావడంతో మూడు ఫ్యామిలీలు టీడీపీలోకి వచ్చి రాజకీయం నడిపిస్తున్నాయి. మొదట జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు పార్టీలోకి వచ్చారు. అలాగే వాళ్ళ ఇద్దరు కుమారులు పవన్, అస్మిత్‌లు సైతం టీడీపీలో పనిచేస్తున్నారు.

ఇటు చిత్తూరులో కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ టీడీపీలోకి వచ్చి పనిచేస్తున్నారు. గత ఎన్నికల ముందు కర్నూలు జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మలు టీడీపీలోకి వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈ మూడు ఫ్యామిలీలు టీడీపీ నుంచి పోటీ చేసి..దారుణంగా ఓడిపోయాయి. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు.


ఇప్పటికే ఈ మూడు ఫ్యామిలీలు బాగానే పికప్ అయ్యాయి. పీలేరులో నల్లారి కిషోర్...ఆలూరులో సుజాతమ్మ, తాడిపత్రిలో జేసీ అస్మిత్, అనంతపురం పార్లమెంట్‌లో పవన్, కర్నూలు పార్లమెంట్‌లో కోట్ల సూర్యప్రకాశ్‌లు బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు సీమలో వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి సీమలో ఈ బడా ఫ్యామిలీలు నెక్స్ట్ ఎన్నికల్లో విజయాన్ని అందుకుని..టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాయో లేదో?


మరింత సమాచారం తెలుసుకోండి: