గ‌న్నూ నాదే బుల్లెట్లూ నావే
నీ స్టేష‌న్ లో కొత్త కానిస్టేబుల్ ని అనుకున్నావా?

తుపాకీ పేలేలోగా మాట‌ల తూటాలు పేలిపోయాయి
ఆ సినిమాలో తెల్సుగా ఆ సినిమా పేరు...పోకిరి....


ఇప్పుడు కూడా స్టేష‌న్లో సెటిల్మెంట్లు ఉన్నాయి..స్టేష‌న్లో ఫోర్జ‌రీ కాగితాలు ఉన్నాయి..స్టేష‌న్లో ఎఫ్ఐఆర్ కాపీల‌కు దిక్కూ దివాణం లే కుండా పోతోంది. ఇప్పుడు కూడా ఆపాల్సిందే..స్టేష‌న్ క‌థ ఎలా ఉందో కూడా చెబుతాను. వాస్త‌వంగా ఏపీ మంత్రి వాస‌న్న (పూర్తి పేరు బాలినేని శ్రీ‌నివాస్  రెడ్డి) రౌడీలు త‌గ్గారు..కాదు త‌గ్గేలా కొన్ని ప‌రిణామాలు త‌లొంచేలా చేశాయి..ఇప్పుడు సుభానీ ఎక్క‌డున్నాడు. సుబ్బారావు గుప్తా కు ఒక్క కేకు ముక్క‌తో అన్నీ మ‌రిచిపోయేలా చేసిన వాసన్న..ఎందుక‌ని? సుభానీని పార్టీ నుంచి స స్పెండ్ చేయించ‌లేదు. ఈ వారం సుభానీ తో పాటు మ‌రో సెటిల్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాను. వాస్త‌వానికి వైసీపీ గూండాలు ఎక్క‌డికక్క‌డ రెచ్చిపోతున్నారు. వారిని నిలువ‌రించాల్సిన బాధ్య‌త గౌర‌వ సీఎందే! కానీ ఆయ‌న ఆ బాధ్య‌త మ‌రిచి ఉంటున్నారు.


భావోద్వేగాలే కాదా చాలా చాలా ప‌రిణామాల కార‌ణంగా వైసీపీ ప్ర‌భుత్వం త‌న ప‌రువు తానే తీసుకుంటుంది అన్న‌ది నిష్టుర స త్యం. అయినా కూడా రౌడీల రైడింగ్ కు పోలీసులు స‌హ‌కారం అందిస్తున్నారు. పోలీసులే ఎస్కార్టుగా ఉంటూ ఆధారాలతో స‌హా దొ రికిపోతున్నారు. అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం విజువ‌ల్ ఎవిడెన్స్
ఉన్నా కూడా ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు అన్న విమ‌ర్శ‌నొక‌టి త‌రుచూ టీడీపీ నుంచి మ‌రియు జ‌న‌సేన నుంచి ఎదుర్కొంటుంది. తాజాగా జ‌గ‌న్ ఈ వివాదం పై కాస్త దృష్టి
సారించార‌ని వినికిడి. కానీ గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో ఆపే స‌మ‌స్య అయితే ఇది కాదు. పోనీ లోక‌ల్ పోలీసు ఆప‌గ‌ల‌డా అంటే అ దీ లేదు..మ‌రి! ఈ స‌మ‌స్య  స్టేష‌న్లో ఉండే పోలీసులు,స్టేష‌న్ బ‌య‌ట రౌడీలూ క‌లిసి ప‌రిష్క‌రించ‌ద‌గ్గ‌ది అని గౌర‌వ ఎమ్మెల్యేలు న‌మ్ముతున్నారు. అందుకే సెటిల్మెంట్ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. స్టేష‌న్లో కానిస్టేబుల్ ను మ‌చ్చిక చేసుకుని,ఎస్సైని మంచి చేసుకుని పాపం!మ‌న గౌర‌వ ఎమ్మెల్యేలు స్టేష‌న్ సెటిల్మెంట్ల‌లో వాటాలు అందుకుంటున్నారు. వీటిని నిలువ‌రించాల్సిన బాధ్య‌త సీఎందే! కానీ.........

 



మరింత సమాచారం తెలుసుకోండి: