జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్ళీ బెదిరింపులు మొదలుపెట్టారు. గుంటూరు జిల్లాలో రైతులను ఆదుకోకపోతే దీక్షకు దిగుతానంటు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. పవన్ వార్నింగుని సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రభుత్వానికి వినిపించారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వాన్ని బెదిరించారు. అప్పుడెప్పుడో వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళకపోతే ఖబడ్దార్.. అంటు వైజాగ్ బహింరగసభలో డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఏమైంది ?
ఏమైందంటే ప్రభుత్వం వార్నింగును లెక్కే చేయలేదు. అలాగే వార్నింగిచ్చిన పవన్ కూడా దాన్ని మరచిపోయారు. తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చి వెంటనే మంగళగిరి పార్టీ ఆఫీసులో మార్నింగ్ 10 టు ఈవెనింగ్ 5 దీక్ష చేశానని అనిపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇపుడు రెండోసారి పవన్ దీక్షకు దిగబోతున్నారట. ఇపుదెందుకంటే గుంటూరు జిల్లాలో వరి, మిర్చి రైతులు దెబ్బతిన్నారట. వెంటనే వరి, మిర్చీని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలట. ఈపని సంక్రాంతిలోగా జరిగిపోవాలని డెడ్ లైన్ కూడా పెట్టారు.
రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేయటంలో తప్పేలేదు. అన్నదాతలకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుంది. కానీ వార్నింగ్ ఇవ్వటంలో ఉన్న దృష్టి తర్వాత ఆచరణలోనే కనబడటంలేదు. ఇక్కడే పవన్ను అందరు చాలా లైటు తీసుకుంటున్నారు. నోటికొచ్చింది ఏదో పూనకం వచ్చినట్లు మాట్లాడేయటం, వార్నింగులు ఇచ్చేయటం మామూలైపోయింది. నిజానికి తానేం మాట్లాడుతున్నారో, ఏమి డిమాండ్ చేస్తున్నారో పవన్ కు తెలుసో లేదో అనుమానంగా ఉంది.
దీక్ష అంటే ఉద్యోగులు ఉదయం ఆఫీసుకు వెళ్ళి సాయంత్రి తిరిగి ఇంటికెళ్ళిపోయినట్లని పవన్ అనుకుంటున్నారు. ప్రతిపక్ష నేత దీక్ష చేస్తానంటే ప్రభుత్వం భయపడిపోవాలి. అలాంటిది పవన్ నుండి దీక్ష అనే వార్నింగ్ వచ్చిందంటే పెద్ద కామెడీ అయిపోయింది. ఏ విషయంలో కూడా పవన్ను అసలు ప్రభుత్వం పట్టించుకోవటమే లేదు. ఆ విషయం పవన్ తో పాటు అందరికీ తెలుసు. సంక్రాంతి పండగ అయిన వారంలోనే దీక్ష చేస్తారంటు నాదెండ్ల చెప్పారు. మొత్తానికి చేయబోయే దీక్ష ఎంతసేపు చేస్తారో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి