ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకు దారుణం గా మారి పోతున్నాయి. మంచి వాళ్ళం అంటూ ప్రజలను నమ్మించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు ఇక ఇప్పుడు అసలు రంగు బయట పెడుతూ దారుణం గా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాల స్వేచ్ఛ కల్పిస్తామంటూ చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో స్వేచ్ఛ అనే పదం వినిపించకుండా అరాచక పాలన సాగిస్తున్నారు. ముఖ్యం గా మహిళలు అందరినీ కట్టు బానిసలా చూస్తూ తాలిబన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు.



 ఈ క్రమం లోనే మహిళలను ఇప్పటికే చదువులు మాన్పించి ఉద్యోగాలు మాన్పించి ఇంటిపట్టునే కూర్చోబెట్టారు. ఇక ఇప్పుడు మీడియా పై కూడా కఠిన ఆంక్షలు విధించారు. ఈ క్రమం లోనే ఆఫ్గనిస్థాన్ దేశం లో ఉన్న మూడు వందలకు పైగా టీవీ ఛానళ్లు, వార్తా పత్రికలు పూర్తిగా మూసి వేయించారు. అంతే కాకుండా వివిధ రకాల వెబ్ సైట్లనూ కూడా పూర్తిగా మూసి వేయించారు. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఏ చిన్న విషయం కూడా బయటకు వెళ్లకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే నేటి సోషల్ మీడియా యుగం లో అక్కడ తాలిబన్ల పాలనలో ఎంతో మంది ప్రజలు సోషల్ మీడియా ద్వారా తాలిబన్ల అరాచకాలను బయట పెడుతున్నారు.



 ఈ క్రమం లోనే ఇక సోషల్ మీడియా ద్వారా అక్కడ జరుగుతున్న విషయాలను బయటకు తెలియజేస్తున్నా కొంత మందిని గుర్తించి వారిని దారుణం గా శిక్ష విధించినట్లు తెలుస్తోంది.  చేతులకు బేడీలు వేసి కారు డిక్కీలో పడుకోబెట్టి.. ప్రతి సెంటర్ తిప్పుతూ చర్ల కోళ్ళతో కొడుకు దారుణం గా వ్యవహరించారట తాలిబన్లు.  ఇలా తాలిబన్లు మనుషులు కాదు మనిషి రూపం లో ఉన్న రాక్షసులు అన్న విధం గానే ప్రవర్తిస్తున్నారట. దీనికి సంబంధించిన విషయం బయటకు రావడం తో సంచలనం గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: