అగ్రరాజ్యమైన అమెరికా ప్రస్తుతం వణికిపోతోంది. మొన్నటి వరకు రెండవదశ కరోనా వైరస్ కారణంగా ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది అమెరికా. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ.. ఎంతో ప్రతిభావంతులైన  డాక్టర్లు ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఉధృతికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మొన్నటి వరకు  కరోనా వైరస్ ప్రభావం నుంచి అమెరికా కోలుకున్నట్లు కనిపించింది.  కానీ మళ్లీ అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ప్రపంచదేశాల భయపడే పరిస్థితి ఏర్పడింది. అంతలా ప్రస్తుతం అమెరికాలో  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. పిల్లలు  పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వైరస్ బారిన పడుతున్నారు. రోజు రోజుకి  కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో అమెరికాలోని ఆసుపత్రిలో మొత్తం కరోనా వైరస్ పేషంట్స్ తో నిండిపోతున్నారూ. ఇక వైద్య సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ప్రతి రోజూ 15 లక్షల వరకు కేసులు వెలుగులోకి వస్తూ ఉండటం ఆందోళనకరంగానే మారిపోయింది. అమెరికాలోని ఎన్నో రాష్ట్రాలు పై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటి పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. అయితే ఒకప్పుడు భారత్ లో కేవలం మూడు లక్షల వరకు కేసులు వెలుగులోకి వచ్చినప్పుడే ఇండియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి అంటూ అమెరికా మీడియా  ఎన్నో కథనాలు ప్రచురితం చేసింది. కానీ ఇప్పుడు సొంత దేశమైన అమెరికా లో 15 లక్షల వరకు కేసులు వెలుగులోకి వస్తున్న కూడా అక్కడి మీడియా మాత్రం ఎక్కడా దీనికి సంబంధించిన వార్తలు రావడం లేదు. హైలెట్ చేసి చూపించడం లేదు. తమ దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకే మీడియా ఇలా సైలెంట్ గా ఉండిపోతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇటీవలే అక్కడి నిపుణులు చెబుతున్న గణాంకాల ప్రకారం అటు  వైరస్ కేసుల సంఖ్య 33 శాతం పెరిగినట్లు తెలుస్తోంది  అంతేకాకుండా మరణాల సంఖ్య 40 శాతం పెరిగిందని హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి మీడియా మాత్రం ప్రపంచ దేశాలకు అసలు విషయాలు తెలియకుండా ఉండేలా నోరుమెదపడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: