ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నిదానంగా పుంజుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండున్నర ఏళ్లలో పార్టీ చాలావరకు పికప్ అయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీ బలపడింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. అలాగే పలు నియోజకవర్గాల్లో వైసీపీని డామినేట్ చేసేలా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. అయితే ఓవరాల్‌గా చూస్తే...పూర్తి స్థాయిలో వైసీపీని టీడీపీ దాటలేదని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులని బట్టి చూస్తే...ఇప్పుడు చాలా వరకు పికప్ అయ్యారు గానీ...వైసీపీ ఆధిక్యాన్ని దాటేలా టీడీపీ ఎదగలేదు. అంటే టీడీపీ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ చాలా చోట్ల పికప్ అవ్వాల్సిన అవసరముంది. అయితే టీడీపీ ఇంకా పికప్ అవ్వాలంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇంకా దూకుడుగా పనిచేయాలి. ఇప్పటికీ పలు చోట్ల టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయలేకపోతున్నారు. అలాగే ఇంకా పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జ్‌లని పెట్టాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకు చూసుకుంటే విజయనగరం జిల్లాలో గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, కురుపాం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకబడింది. ఇటు విశాఖపట్నం జిల్లా విషయానికొస్తే చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి లాంటి చోట్ల టీడీపీ బలపడలేదు. ఇటు తూర్పు గోదావరిలో ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, ప్రత్తిపాడు, పి.గన్నవరం, కొత్తపేట, తుని, రాజానగరం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకబడింది.

పశ్చిమ గోదావరిలో పోలవరం, చింతలపూడి, నరసాపురం, భీమవరం...కృష్ణాలో గుడివాడ, గన్నవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ కాలేదు. గుంటూరులో మాచర్ల, నరసారావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ  పికప్ అవ్వాలి..ఇక నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు లాంటి జిల్లాల్లో టీడీపీ చాలా వెనుకబడి ఉంది. ఈ జిల్లాల్లో టీడీపీ కనీసం...వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలిగితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ  పార్టీకి బెనిఫిట్ అవుతుంది. లేదంటే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: