జ‌గ‌న్ ను అధికారులు ఖాత‌రు చేయ‌రు అని అంటారు? ఇది వాస్త‌వం అయితే కాదు. జ‌గ‌న్ అధికారుల‌ను బెదిరించ‌రు అంటారు ఇది కూడా వాస్త‌వం కాద‌నే తేలిపోయింది. ఇంకేం ఓ క‌లెక్ట‌ర్ హోదా ఉన్న అధికారి (ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి) మోకాలిపై కూర్చొని విన‌య విధేయ‌త‌లు ఎందుకు ప్ర‌ద‌ర్శిస్తున్నారో?


ఉన్న‌తాధికారులు, వారి కి అనుగుణంగా న‌డుచుకునే అధికారులు అంతా జ‌గ‌న్ కు వంగి వంగి ఎందుకు దండాలు పెడుతున్నారో అర్థం కావ‌డం లేదు. ఎందుక‌ని సొంత వ్య‌క్తిత్వాన్ని వ‌దులుకుని వ‌ద్ద‌నుకుని మ‌రీ! ప్ర‌వ‌ర్తిస్తున్నారో అంతు చిక్క‌డం లేదు. అంత‌గా సాగిల‌ప‌డి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని? ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ఎలానూ వ్య‌తిరేకించ‌లేరు క‌నీసం నిల‌బ‌డి త‌లెత్తుకుని మాట్లాడేందుకు కూడా పాపం జ‌గ‌న్ అంటే హ‌డ‌లిపోతున్నారా?మ‌రీ! మోకాలి పై కూర్చొని మాట్లాడితే కానీ జ‌గ‌న్ ఒప్పుకోరా? ఏంటి? స్వామి భ‌క్తి ఎక్కువ అయితే ఇలానే ఉంటుందా? లేకా మ‌రో విధంగా ఉంటుందా?


నిన్న‌టి వేళ గ‌ణతంత్ర వేడుక‌లు విజ‌య‌వాడ ఇందిరా గాంధీ మున్సిప‌ల్ మైదానం లో ఘ‌నంగా జ‌రిగాయి. వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు.ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాట‌వుతాయ‌ని చెప్పారు గ‌వ‌ర్న‌ర్.ఇదే సంద‌ర్భంలో వివాదాస్ప‌ద సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేడుక‌లు వీక్షించేందుకు ఆడియెన్స్ గ్యాల‌రీ కూర్చొండ‌గా ఆయ‌న కాలి ద‌గ్గ‌ర కూర్చొని మరీ ఐఏఎస్ అధికారి (ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి) ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ క‌నిపించారు. ఇది చూసి ప‌లువురు ఔరా! అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

అయినా ఓ ఐఏఎస్ అధికారి అలా కూర్చొని స‌మాధానం చెప్పాల్సిన అవ‌సరం ఏమొచ్చింద‌ని, అంత‌గా సీఎంకు వంగి వంగి దండాలు ఎందుకు పెట్టాల‌ని విప‌క్షం ప్ర‌శ్నిస్తోంది. సాధార‌ణంగానే ఐఏఎస్ లు అంతా పాల‌క వ‌ర్గం ఏం చెబితే అదే అన్న విధంగా  న‌డ‌చుకుంటారు అన్న‌ది లోకంలో స్థిర‌ప‌డిన అభిప్రాయం.దానికి కొన‌సాగింపుగా ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ప్ర‌వ‌ర్త‌న ఉండ‌డంతో విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. ఆయ‌న‌కంటూ ఓ సొంత వ్య‌క్తిత్వం ఉంది క‌దా! దానిని కాపాడుకోవాలే కానీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తించాల్సిన అవ‌స‌రం అయితే లేదు అని విప‌క్షం వ్యాఖ్యానిస్తుంది.

ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ అనే ఐఏఎస్ చాలా రూల్స్ మాట్లాడే అధికారి.ఎవ్వ‌రికీ త‌ల‌వొంచ‌రు అనే పేరు కూడా ఉంది. ఆంధ్రాభ‌వ‌న్ వ్య‌వ‌హారాలు చూసిన‌ప్పుడు కూడా ఇలానే పేరుంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఆయ‌న అక్క‌డ ప‌నిచేశారు. అప్ప‌ట్లో అనేక వివాదాలు రేపారు. కొంత‌కాలం విద్యుత్ శాఖ ఉన్న‌తాధికారిగా ప‌నిచేశారు. అక్క‌డ కూడా వివాదాలు రేపారు.అంత‌టి క‌ఠినాత్ముడు ఎందుకిలా జ‌గ‌న్ ద‌గ్గ‌ర వంగి వంగి దండాలు పెడుతున్నార‌ని? అంత పేరున్న అధికారి ఓ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో ఎందుక‌ని సొంత వ్య‌క్తిత్వానికి తిలోద‌కాలిచ్చార‌ని?



 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp