సంకల్పం దృఢంగా ఉండాలే కాని సాధించలేనిది ఏమి లేదు అని నమ్మి, నమ్మిన బాటలో కష్టమైనా నష్టమైనా తనను నమ్ముకున్న వారి కోసం ముందుకు సాగే వ్యక్తి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది ఒకరంటున్న మాట కాదు కొన్ని లక్షల హృదయాలు పలుకుతున్న మాట. జగనన్న వచ్చాక ఏం మార్పు వచ్చింది అని వేళ్లపై లెక్కేసుకుంటూ వెతుక్కునే పరిస్థితి కాదు. ఎంత అభివృద్ధి జరిగింది అని మాటల్లో చెప్పలేనంత సంతోషాలను కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగులను ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. ఎన్నో పథకాలు మరెన్నో ఉజ్వల భవిష్యత్తును అందించే మార్పులను మన ముందు ఉంచారు.

ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి హమీ ఇచ్చిన దానికంటే పదింతలు ఎక్కువ గానే చేస్తున్నారు. ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే పిల్లలంతా గొప్ప గొప్ప చదువులు చదవాలి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి, ఆర్దికంగా బాగా స్థిరపడాలని ఆకాంక్షించారు జగన్. అలా చదువుకోవడానికి వారికి మార్గం కల్పించాలి అని అదే ఈ మామయ్య పిల్లలకు ఇచ్చే పెద్ద బహుమతి, ఆస్తి అంటూ ఆనందంగా చెప్పారు. చెప్పిన విధంగానే చేసుకుపోతున్నారు మన జగన్.  విద్యకు పెద్ద పీట వేసి విద్యాశాఖలో ఎంతో మార్పును తీసుకువచ్చారు. భావి బంగారు భవిష్యత్తుకు బాటను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుత ఏపి సిఎం జగన్ పాలనను దేశం అంతా ప్రశంసిస్తూ ఉంది. ఇదే విషయంపై వై.సి.పి నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపి సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. విద్యా విప్లవం తీసుకొచ్చిన మహానేత ఉజ్వల భవిష్యత్తు కార్యకర్త జగనన్న అంటూ కొనియాడారు. అయితే మరో వైపు ప్రతిపక్షాలు మాత్రం చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనితో సామాన్య ప్రజలకు సైతం ఎవరు మంచి చేదు అనే విషయంలో సందిగ్దత ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: