చెప్పుకోవటానికే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ ఏ విషయంలోను నేరుగా స్పందిచేది ఉండదు. ఎప్పుడూ డొంకతిరుగుడు యవ్వారమే. తాజాగా ఎన్టీయార్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు గురించి స్పందించటానికే 36 గంటలు పట్టింది. అదికూడా అడ్డదిడ్డంగా మాట్లాడారు.  కొత్తజిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడంపై స్పందిచవయ్యా బాబూ అంటే ఎన్టీయార్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామన్నారు. ఎన్టీయార్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు.




ఇంకా విచిత్రమేమిటంటే ఎన్టీయార్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని చెప్పటమే. మరలాంటపుడు ఏకంగా ఏపీకే పేరుమార్చి ఎన్టీయార్ స్టేట్ అని పేరు పెట్టుండాల్సింది. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని తామెప్పటి నుండో చేస్తున్న డిమాండ్ ను వినిపించారు. అధికారంలో ఉన్నపుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే  చంద్రబాబుకు ఈ విషయం గుర్తుకొస్తుంది. కేంద్రంలో చక్రంతిప్పానని చెప్పుకున్న రోజుల్లో ఒక్కసారి కూడా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదు.




జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటిన్లను ఎందుకు ఆపేశారంటు విచిత్రమైన లాజిక్ లేవదీశారు. అధికారంలోకి రాగానే కాకుండా ఎన్నికలో మరో ఆరునెలల్లో వస్తాయనగా చంద్రబాబు అన్న క్యాంటిన్లను పెట్టారు. అంటే అన్న క్యాంటిన్లను చంద్రబాబే ఎలక్షన్ స్టంట్ గా చేసినపుడు ఇక జగన్ కు మాత్రం ఎందుకు  గౌరవం ఉంటుంది. జిల్లాల సంఖ్యను పెంచటం జగన్ తొందరపాటు చర్యగా చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీయార్ విగ్రహాన్ని ధ్వసం చేయటాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక విగ్రహం ధ్వసంచం చేసిందెవరు ? ఒకపుడు టీడీపీ జడ్పీటీసీగా చేసిన నేత కొడుకే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు.




మొత్తానికి ఏ విషయంలో కూడా చంద్రబాబు స్పందన సూటిగా ఉండదని మరోసారి తేలిపోయింది. అవసరమైనపుడు పొద్దున లేచింది మొదలు ఎన్టీయార్ విగ్రహానికి దణ్ణాలు పెట్టుకునే చంద్రబాబు జిల్లాకు పేరు పెట్టడంపై స్పందించేందుకు 36 గంటలు తీసుకున్నారు. ప్రభుత్వానికి కనీసం ధన్యవాదాలు కూడా చెప్పటానికి మనసురాలేదు. అంతేలే కొత్త జిలాకు తండ్రి పేరు పెట్టిన విషయమై మాట్లాడేందుకు సొంత కొడుకు నందమూరి బాలకృష్ణకే మనసురాలేదు. ఇక చంద్రబాబుకు ఏమొస్తుంది ?


మరింత సమాచారం తెలుసుకోండి: