హైదరాబాద్ కు అంతర్జాతీయ కంపెనీలను తీసుకు రావడం లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికీ పలు కంపెనీలను హైదరాబాద్ తీసుకురాగా ఇక ఇప్పుడు మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ లో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమైంది.  ఇటలీకి చెందిన డ్రిల్ మెక్  తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎంవోయూ జరగనుందని తెలుస్తోంది. ఈ సందర్భం గా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఆయన.



 కనీసం ఈ సారైనా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరారు కేటీఆర్. అంతే కాకుండా రాష్ట్రం లో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు కూడా కేంద్ర ప్రభుత్వం అందించాలి అంటూ కోరారు ఆయన. అదే సమయంలో తెలంగాణ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఫార్మాసిటీ కేంద్రం నుంచి రావాల్సిన విధులు ఇప్పటి రాలేదు అంటూ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం చేస్తున్నారు.


 కానీ రాష్ట్రాలకు సరిపడా నిధులు అందించక పోతే ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటూ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఉన్న నాలుగు పెద్ద రాష్ట్రాల లో తెలంగాణ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకు తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా హక్కుల డిమాండ్ల కోసం కేంద్రం పై పోరాటం చేసేందుకు సిద్ధం గా ఉన్నామని చెప్పిన కెసిఆర్.. పెట్టు బడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్న ఇటలీకి చెందిన డ్రిల్ మేక్ సంస్థకి ధన్య వాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: