అలాగే జగన్ని హీరోలు పొగడటంతో చంద్రబాబు బాగా హార్ట్ అయ్యారని, లోలోపల ఆయన బాధపడుతున్నారని కూడా వైసీపీ అనుకూల మీడియా కథనం ఇచ్చింది...అంటే జగన్ని హీరోలు పొగిడితే...బాబు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారట? అంటే ఇదంతా వైసీపీ అనుకూల మీడియా చూసిందా? అని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అసలు హీరోలు పొగిడితే...ఇంకా జగన్కు మైలేజ్ పెరిగిపోతుందని వైసీపీ శ్రేణులు అనుకోవడం వారి భ్రమ అని తమ్ముళ్ళు అంటున్నారు.
ఎందుకంటే సినీ ఇండస్ట్రీకు సంబంధించి జగన్ ఏం చేశారో అందరికీ బాగా తెలుసని..అసలు సమస్య సృష్టించిందే జగన్ అని, పైగా ఆ సమస్యని పరిష్కరిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేది కూడా జగనే అని తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కేవలం సినీ నటులని తన దగ్గరకు రప్పించుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేశారని, ఇదంతా జనాలకు బాగా తెలుసని, పైగా ప్రజా సమస్యలని పక్కదారి పట్టించడానికి సినీ నటులతో సమావేశాలని డ్రామాకు తెరతీశారని అంటున్నారు.
అసలు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి...ఆ సమస్యలకు జగన్ ప్రభుత్వం ఎప్పుడు పరిష్కారం చూపించలేదని, పైగా జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలపై పన్నుల భారం దారుణంగా పెరిగిందని, అసలు అన్నిరకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటప్పుడు ఏదో హీరోలు పొగిడితే జగన్కు ప్లస్ అవ్వదని అంటున్నారు. కాబట్టి సినీ హీరోలు పొగడటం వల్ల జగన్కు వచ్చే బెనిఫిట్ ఏమి లేదని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి