అయితే.. బాహుబలి తర్వాత తెలుసు సినిమాల విడుదల ట్రెండ్ కూడా మారింది. ఓ భారీ సినిమా వచ్చినప్పుడు దాదాపు నూటికి 90 శాతం థియేటర్లు ఆ సినిమాయే ఆడుతోంది. మొదటి వారంలోనే పెట్టుబడులు వచ్చేలా ఈ పరిణామం సహకరిస్తోంది. అలా నాలుగైదు భారీ సినిమాలు వస్తే.. ఇక థియేటర్లన్నీ వాటితోనే నిండిపోతాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాల నడుమ.. మంచి కథ కథనంతో నిర్మితమయ్యే చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి.
చిన్న సినిమా ఎంత బాగున్నా..అది అసలు థియేటర్లో ఆడితే కదా.. ఆ విషయం ప్రేక్షకులకు తెలిసేది. మరి ఈ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి.. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అవకాశాలు కల్పించేది ఇలాంటి చిన్న సినిమాలే.. సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచినా ఈ చిన్న సినిమాలకు నష్టమే.. అందుకే ఈ చిన్న సినిమాల విడుదల సమస్యకు ఓ పరిష్కారం దొరకాల్సి ఉంది. నిన్న సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్ తో సమావేశం అయినప్పుడు ఈ సమస్య కూడా చర్చకు వచ్చిందట.
ఈ సమస్య గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్న జగన్.. ఇండస్ట్రీ అంటే అందరూ బతకాలి.. అన్ని రకాల సినిమాలు ఆడాలి.. అందుకు పరిష్కార మార్గం మీరే ఆలోచించాలని సూచించారట. మీరు ఓ పరిష్కార మార్గంతో వస్తే.. దాన్ని అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారట. అలా చిన్న సినిమాల విడుదల సమస్యను పరిష్కరించే బాధ్యతను జగన్.. చిరంజీవి, రాజమౌళికి అప్పగించినట్టు తెలిసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి