సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. సినీ పెద్దల సమస్యలు విన్న జగన్.. వాటి పట్ల సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రావైపు కూడా చూడాలని సినీ పెద్దలను కోరారు. మన విశాఖకు వచ్చేయండి.. మీ కోసం అన్నీ ఇస్తానంటూ తాయిలాలు చూపించారు జగన్.. మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా.. కట్టుకోవడానికి స్టూడియోల కోసం భూములు ఇస్తా.. అన్నీ ఇస్తా.. మీరు వచ్చేయండని ఆహ్వానించారు.


ఇప్పుడు జగన్ సర్కారు ఆ దిశగా భూములు కూడా సేకరిస్తోంది. సినిమా నిర్మాణానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడి భూమలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎక్కడ స్థిర పడేందుకు ఇష్టపడతారు.. వారికి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ లభిస్తాయి అనే అంశాలపై ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయల సీమ ప్రాంతాల్లో సినీ పరిశ్రమ కోసం భూములు సేకరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా షూటింగులు, స్టూడియోల నిర్మాణం కోసం అవసరమైన భూములను సేకరించబోతున్నారు.


ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న భూములను పరిశీలంచి.. వాటిని చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఆ సంస్థ ద్వారా అభివృద్ధి చేసి సినీ పెద్దలకు అప్పగించేందుకు యోచిస్తున్నారు.


అయితే భూముల బదిలీ ఎలా చేయాలనే అంశంపైనా చర్చలు  జరుగుతున్నాయి. ముందుగా బిల్డ్ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్ అంటే బీవోటీ విధానంలో స్టూడియోల ఏర్పాటుకు ఇంట్రస్ట్ ఉన్నవారిని ఆహ్వానిస్తూ బిడ్లు పిలవనున్నారు. అలాగే ప్రైవేటుగా స్టూడియోలు కట్టేందుకు నేరుగా ముందుకొస్తే వారి కోసం కూడా భూములు కేటాయిస్తారట. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ కోసం జగన్ భూములు సిద్దం చేస్తున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: