జనసేన నేతల ఆలోచనలు, ఆశలు మామూలుగా లేవు. నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభ పేరుతో నిర్వహించిన బహిరంగసభ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న గోదావరి తీరంలో మత్స్యకారుల కోసం బహిరంగ సభ పెట్టడంలోనే జనసేన వ్యూహం దాగుంది. ఎప్పుడైతే సభ సక్సెస్ అయ్యిందో అప్పటి నుండి జనసేన అధినేత పవన్ కల్యాణే కాదు సీనియర్ నేతలను కూడా పట్టడం కష్టంగానే ఉంది.




ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో జనాలందరు పవన్ వైపు చూస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో పవనే సీఎం కావాలని జనాలందరు కోరుకుంటున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యానారాయణ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జనాలంతా పవన్నే సీఎంగా కోరుకుంటున్నారని చెప్పటానికి బొలిశెట్టి దగ్గరున్న ఆధారాలు ఏమిటో అర్ధం కావటంలేదు. ఒక సభ సక్సెస్ అయితే జనాలంతా పవన్నే సీఎంగా కోరుకుంటున్నట్లే అనేసుకోవటమేనా ?




జనసేన అధినేత కాకముందే పవన్ ఒక నటుడు. కాబట్టి రాజకీయనేతగా కన్నా పవన్ను జనాలు ఎక్కువగా సినీనటుడిగానే చూస్తారు. అందుకనే పవన్ ఎక్కడ సభ పెట్టినా మామూలు జనాలకన్నా అభిమానులే ఎక్కువుంటారు. సభ మొదలైన దగ్గర నుండి పవన్ను ఉద్దేశించి సీఎం సీఎం అంటు నానా రచ్చ చేసేస్తారు. ఇదే విషయాన్ని వైజాగ్ బహిరంగసభలో పవన్ స్పష్టగా చెప్పారు. ‘నా సభకొచ్చి సీఎం సీఎం అని అరవండి ఓట్లు మాత్రం వైసీపీకి వేయండి’ అంటు అన్నమాటలు అందరికీ గుర్తుంది.




రెండు కుటుంబాల అధర్మ, అరాచక పాలనను రాష్ట్ర ప్రజలు అనుభవించారట. అందుకనే రాబోయే ఎన్నికల్లో పవన్ను సీఎం చేద్దామని జనాలు ఫిక్సయిపోయినట్లు బొలిశెట్టి ఏదేదో ఊహించేసుకుంటున్నారు. సిద్ధాంతాలను నమ్మేవారు, రాజకీయాల్లో మార్పును కోరుకునే వారంతా జనసేనలో క్రియాశీలక సభ్యులుగా చేరాలని కోరారు. ప్రజాబలాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చేసిందని బొలిశెట్టి పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుంటే ఇప్పుడే ప్రజాబలం ప్రదర్శించే సమయం వచ్చేయటం ఏమిటో జనసేన నేతలకే అర్ధంకావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: