ఇప్పటికే టీడీపీ నాయకులకు తెలిసి ఉంటుంది రాష్ట్ర ప్రజలలో వారికి ఎంత మద్దతు ఉందో అని... దీనికి రుజువు కావాలంటే టెక్కలి ఎమ్మెల్యే గా ఉన్న అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి చూడు అప్పుడు తెలుస్తుంది టీడీపీకి ఎంత బలం ఉందో ప్రజల్లో... ప్రతి మహిళ తమ యొక్క శక్తిని టీడీపీ కి వ్యతిరేకంగా ఓటు వేసి చూపిస్తారని చెప్పారు. ముందు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోండి తర్వాతనే మా మీద సెటైర్ లు వేయవచ్చు అని ఘాటుగా సమాధానమిచ్చింది. మహిళల గురించి మాట్లాడే కనీస హక్కు కూడా టీడీపీకి లేదని హెచ్చరించింది. ఏపీ సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలని వారికోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారు.
అలాంటి జగన్ కి మీతో పోలిక ఏంటి అంటూ చంద్రబాబు అండ్ కో ను ఏకిపారేసింది. చంద్రబాబు మరియు జగన్ ఇద్దరూ ఒకటి కాదు. జగన్ రాష్ట్ర మహిళలకు దేవుడు లాంటి వాడని కొనియాడింది. జగన్ ను రాష్ట్ర మహిళ ఆశీస్సులు ఉన్నాయని, ఎంత మంది ఎన్ని కుయుక్తులు పన్నినా ఏమీ చేయలేరని గట్టిగా చెప్పారు రోజా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి