మన దేశం నుంచి ఏదైనా ఎగుమతి అవుతుందంటే అది మనకు గర్వ కారణం.. ఎందుకంటే.. ఆ దేశం దగ్గర లేని వస్తువును మనం తయారు చేస్తున్నాం కాబట్టి.. అలాగే.. ఆ ఎగుమతుల కారణంగా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది కాబట్టి.. కానీ కొన్ని ఎగుమతులు మన పరువు తీస్తాయి. డ్రగ్స్ ఎగుమతి అలాంటిందే. మన  హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు క్‌కు మత్తుమందుల ఎగుమతి అవుతున్న విషయాన్ని తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఎన్‌సీబీ.. రట్టు చేసింది. ఈ ఎన్‌సీబీ అంచనాల ప్రకారం.. గత ఏడాది కాలంలో హైదరాబాద్ నుంచి ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్  ఎగుమతి అయినట్టు గుర్తించారు.


హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడటం కొత్తేమీ కాదు.. కానీ.. ఏకంగా ఎగుమతి చేసే రేంజ్‌లో డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారన్న విషయం పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తోది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫార్మా కంపెనీలను అడ్డుపెట్టుకుని వాటిలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న లూసెంట్‌ డ్రగ్స్‌ అనే  ఫార్మా కంపెనీలో ట్రెమడాల్‌ అనే మత్తుమందు తయారవుతోంది. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది.


ఈ సంస్థలో తయారవుతున్న టెమడ్రాల్‌  ను ఎగుమతి చేసుకునేందుకు కూడా ఆ సంస్థకు అనుమతులు ఉన్నాయి. అయితే.. దాన్ని డెన్మార్క్‌, జర్మనీ, మలేసియాలకు ఎగుమతి చేసేందుకే పర్మిషన్ ఉంది. కానీ ఈ  లూసెంట్‌ సంస్థ దొడ్డిదారిలో పాకిస్థాన్‌కు కూడా ఎగుమతి చేసినట్లు ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ టెమడ్రాన్‌ డ్రగ్స్ కాదు.. ఇది పెయిన్ కిల్లర్ లాంటిది. కానీ.. మత్తుబాబులు దీన్ని మత్తు కోసం కూడా వాడుతున్నారు. అంతే కాదు.. ఈ సంస్థకు ఔషధాల  తయారీ కోసం ఎసిటిక్‌ ఎన్‌హైడ్రైడ్‌ను వాడుకునేందుకు  అనుమతి ఉంది.


కానీ.. ఈ ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్‌ను హెరాయిన్‌ తయారీకి కూడా వాడతారు. ఈ సంస్థ ఈ ఎసిటిక్‌ ఎన్‌ హైడ్రైడ్‌ను కూడా మాయం చేసింది. దీంతో ఈ డ్రగ్స్ దందాపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. ఎన్సీబీ అధికారులు లూసెంట్‌ డ్రగ్స్‌ సంస్థ పై దాడి చేసి.. ఎండీ వినోద్‌జైన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ దేవరశెట్టి సాయి వికాస్‌, జనరల్‌ మేనేజర్‌ కరిమిశెట్టి భాస్కరరావులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: