సంవత్సరాలు గడిచిపోతున్న కరోనా వైరస్ మహమ్మారి మాత్రం ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. మహమ్మారి  వైరస్ ని తరిమి కొట్టేందుకు శాస్త్రవేత్తలు ఎన్ని దారులు వెతికినా కొత్తదారుల్లో విస్తరిస్తూనే ఉంది.. ఇక రూపాంతరం చెందుతూ అంతకు మించిన వేగంతో మళ్ళి శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచదేశాలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లను తరిమి కొట్టారు అని సంతోషపడే లోపే మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికీ కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో అగ్రదేశం అమెరికాలో కూడా నాలుగో దశ విజృంభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అయ్యాయని తెలుస్తోంది.


 కొత్త వేరియంట్ XE  వ్యాప్తి వేగం గా ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక పలు దేశాల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అటు భారత్లో కూడా ఈ కొత్త వేరియంట్ను బయట పడింది అన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. త్వరలో నాలుగో దశ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అందుకే నియంత్రణ చర్యలు మొదలు పెట్టాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.


 ముఖ్యంగా ప్రస్తుత సమయంలో కేరళ హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ మిజోరాం రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిలకు ఒక లేఖ రాయడం గమనార్హం. అంతేకాకుండా నాలుగొ దేశవ్యాప్త నేపథ్యంలో ముందస్తు డోస్ పై కూడా కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ పదవ తేదీ నుంచి ప్రైవేట్  కేంద్రాలలో కూడా 18 ఏళ్లు నిండిన వారు అందరికీ కూడా ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం గమనార్హం. ఇక రెండవ డోసు తీసుకొని నెలలు పూర్తయిన వారు అందరూ కూడా ప్రికాషన్ డోస్ తీసుకోవాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: