విదేశీ పర్యటనకు వెళితే చంద్రబాబునాయుడే వెళ్ళాలి లేదా పుత్రరత్నం నారా లోకేష్ వెళ్ళాలంతే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలంటే చంద్రబాబే ఉండాలి లేకపోతే లోకేష్ మాత్రమే ఉండాలి. అవినీతికి పాల్పడినా, అరాచకాలు చేసినా వీళ్ళకు మాత్రమే రైట్ ఉంది అంతేకానీ మరో వ్యక్తి సీన్ లోకి రాకూడదు. ఇంకెవరైనా వచ్చినా ఏదోలా సర్దుకుంటారే కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అస్సలు రాకూడదు. ఖర్మకాలి వచ్చారంటే ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉంచకూడదంతే.





చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియా వైఖరి ఇలాగే ఉంది.  జగన్ ఇపుడు దావోస్ పర్యటనకు వెళ్ళటాన్ని తండ్రి, కొడుకులు, ఎల్లోమీడియా, తమ్ముళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. విజయవాడలో ప్రయాణమైంది మొదలు ఏదో ఒక బురద చల్లేస్తునే ఉన్నారు. జగన్ పర్యటనపై నానా రచ్చచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఇదంతా సరిపోదన్నట్లు లోకేష్ తాజాగా జగన్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. అవేమిటంటే దావోస్ లో ఏపీకి రాజధాని ఏదంటా జగన్ ఏమని సమాధానం చెబుతారు ?





పీపీఏలను ఎందుకు రద్దుచేశారని దావోస్ లో అడిగితే జగన్ ఏమని సమాధానం చెబుతారు ? దావోస్ లో వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లుంది తప్పితే పెట్టుబడుల సదస్సుకు వెళ్ళినట్లు లేదట. దావోస్ లో పారిశ్రామికవేత్తలు ఎవరు జగన్ను కలవటానికి రాలేదట. గడచిన 24 గంటల్లో జగన్ కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మాత్రమే. ఆయన్ను కలవటానికి ఢిల్లీకి వెళితే సరిపోయేదానికి ఏకంగా దావోస్ కు వెళ్ళటం ఎందుకంటు ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్ళి ఏమి సాధించుకుని వచ్చారో చెబితే జనాలు విని సంతోషిస్తారు.






చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియా కోరిక ఏమిటంటే దేశం విడిచివెళ్ళేందుకు జగన్ కు కోర్టులు పర్మిషన్ ఇవ్వకూడదు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైపోతే అప్పుడు జనాలకు వేరేదారిలేక మళ్ళీ టీడీపీకే ఓట్లేస్తారన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం. అయితే వీళ్ళనుకున్నట్లు జరగకపోయేసరికి తట్టుకోలేక శాపనార్ధాలు పెట్టేస్తున్నారు. అయినా దావోస్ లో ఏపీ రాజధాని గురించి, పీపీఏల గురించి అడిగేదెవరు ?

మరింత సమాచారం తెలుసుకోండి: