ప్లాస్టిక్ అనేది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో రానున్న రోజుల్లో ఇది జీవకోటికి ఎంత ప్రమాదకరమో
అందరికీ తెలిసిన రహస్యమే. అయినా కూడా ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు విచ్చల విడిగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను వాడేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చాలాసార్లు పలు చర్యలను , ప్లాస్టిక్ బ్యాన్ వంటివి చేపట్టారు. కానీ అవి నామమాత్రంగానే మిగిలాయి. అయితే ఈసారి తీసుకునే నిర్ణయం చాలా దృఢంగా ఉండనుంది అని ప్లాస్టిక్ వినియోగం ఖచ్చితంగా భారీ ఎత్తున తగ్గించే విదంగా చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు కలెక్టర్. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున్   జివిఎంసి కమిషనర్‌ తో కలిసి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 5 నుంచి విశాఖలో 75 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, మార్కెట్లు,
సూపర్‌ బజారులు, తదితర ప్రదేశాలలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసి ఇప్పటికే నిర్వహిస్తున్నాము అని పేర్కొన్నారు . కాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనల్ని మనం రక్షించుకోవడానికి జరిగే ఈ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్థులు అందరూ భాగమయ్యి సహకరించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ప్లాస్టిక్ కి బదులుగా వస్త్ర, నార, కాగితపు సంచుల వాడకంపై అవగాహన కల్పించి వారి వినియోగాన్ని భారీగా పెంచాలని అధికారులకు సూచించారు.

ఆర్‌కె.బీచ్‌లో ఏకో బజార్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని  తద్వారా మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. జూన్‌ 5వ తేదీ నుంచి రెండు వారాల తరువాత 75 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ వినియోగించే వారికి జరిమానా విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ఇక ఈ పద్దతి కొనసాగుతుంది అని ప్లాస్టిక్ ను అతి త్వరలో అరికడతామని చెప్పుకొచ్చారు.  ఇందులో భాగంగా 2023 జనవరి 1 నుంచి 125 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ నిషేధించనున్నట్లు తెలిపారు. ఒక్క విశాఖలో రోజుకు వెలువడే 800 టన్నుల చెత్తలో 300టన్నుల ప్రమాదకర ప్లాస్టిక్‌ ఉండటం గమనార్హం ఆ స్థాయిలో ప్లాస్టిక్ వినియోగం ఉందని వాపోయారు. కాగా ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే నష్టం మనకే అన్న విషయం గుర్తుంచుకోవాలి అని అన్నారు.  

త్వరలో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, వినియోగంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించే ప్రయత్నం గట్టిగా చేస్తామని ఆయన అన్నారు. నిజమే కాదా నేడు చిన్నారులు తినే రూపాయి వస్తువు నుండి, మార్కెట్ నుండి తీసుకొచ్చే కూరగాయల వరకూ అన్ని కూడా ప్లాస్టిక్ కవర్లలలో ప్యాక్ చేస్తున్నారు. అనంతరం వాటిని సింపుల్ గా బయట పడేస్తున్నారు. అలా ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. రీసైక్లింగ్ కూడా ఉపయోగించాలని విధంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పెరిగిపోతున్నాయి. భూమిలో కొన్ని వందల ఏళ్ళు అయినా కరగని ఈ ప్లాస్టిక్ భూమిని ఎంతగా నాశనం చేస్తుంది అన్నది తెలిసిందే. అలా ఇది భవిష్యత్తులో జీవకోటికి  మనుగడకే ప్రమాదం కలిగించనుంది. మరి ఇటువంటి ప్లాస్టిక్ ను ఇప్పటి నుండే నిషేధిస్తూ మన పిల్లల తారలు అయిన ఆరోగ్యంగా , సంతోషంగా జీవించడానికి మనం సహకరించడం మన బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: