వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నిరాస తప్పేట్లు లేదు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఏదో విధంగా బీజేపీని  అధికారంలోకి తీసుకువస్తున్న మోడీకి పప్పులు వచ్చే ఎన్నికల్లో ఉడికేట్లులేదు. ఎందుకంటే దక్షిణాధిరాష్ట్రాల్లో ఒక్క కర్నాటకలో తప్ప ఇంకెక్కడా నిలువనీడలేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా రాష్ట్రపతి కోటాలో ఎంపికైన నలుగురు రాజ్యసభ ఎంపీ అభ్యర్ధులపై చర్చలు జరుగుతున్నాయి కాబట్టే.





నిజానికి తాజాగా ఎంపికైన నలుగురి వల్ల బీజేపీకి ఎలాంటి రాజకీయ మైలేజీ వచ్చే అవకాశంలేదు. పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమా రచయిత విజయేంద్రప్రసాద్, ఆధ్యాత్మిక, సామాజిక కార్యకర్త వీరేంద్ర హెగ్డే వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగముండదు. ఒక రాజకీయపార్టీ ఎవరినైనా రాజ్యసభకు నామినేట్ చేసిందంటే ఏదో పద్దతిలో రిటర్స్స్ ఎక్సపెక్ట్ చేయకుండా ఉండదు.






ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అడుగు వేసినా, ఒక ఎత్తు వేసినా మనకేంటి లాభమనే కచ్చితంగా ఆలోచిస్తుంది. కానీ తాజాగా నామినేట్ అయిన నలుగురి వల్ల బీజేపీకి ఏమిటి లాభమో అర్ధం కావటంలేదు. కర్నాటకలో మాత్రమే కాస్తో కూస్తో బీజేపీ అధికారంలోకి వచ్చి పోతోంది. మిగిలిన తమిళనాడు, కేరళ, ఏపీలో పార్టీకి దిక్కేలేదు. సమీప భవిష్యత్తులో పై మూడు రాష్ట్రాల్లో నిలదొక్కుకునే అవకాశం వస్తుందని కూడా ఎవరు అనుకోవటంలేదు.





ఏ విదంగా చూసినా వచ్చే ఎన్నికలు మోడీకి నిరాస తప్పదనే అనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాలను కూలగొట్టేయటం బీజేపీకి అలవాటుగా మరింది. అయితే కమలనాదుల పాచికలు దక్షిణాధిలో పారటంలేదు. ఎందుకంటే దక్షిణాధిలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ చాలా బలంగా ఉండటమే కారణం. పైగా ప్రజల తీర్పుకూడా పూర్తిగా ఏకపక్షంగా ఉంటున్నది. ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉన్నచోట బీజేపీ చూస్తు కూర్చోవటం తప్ప చేయగలిగిందేమీలేదు. ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీకి పూర్తిగా నిరాస తప్పేట్లులేదనే అనిపిస్తోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.





 

మరింత సమాచారం తెలుసుకోండి: