ఒకవైపేమో ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు. మరోవైపేమో అసలు టీడీపీ పార్టీతో పొత్తే వద్దంటున్న కమలంపార్టీ నేతలు. ఇదే సమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరిపోయిందని దీపావళి ముందో తర్వాతో ఎన్డీయేలో చేరబోతున్న టీడీపీ అంటు ఎల్లోమీడియా రాద్దాంతం. వీటన్నింటి నేపధ్యంలోనే బీజేపీ సీనియర నేతలు జీవీఎల్ నరసింహారావు, ఇన్చార్జి సునీల్ దేవధర్ మీడియాతో మాట్లాడుతు అవినీతి, కుటుంబపార్టీలతో తమకు పొత్తుండదని ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని ఫైనల్ చేశారు.
ఇక్కడ జీవీఎల్, దేవధర్ మాట్లాడింది టీడీపీని ఉద్దేశించే అని అందరికీ తెలుసు. గతంలో తమకు చంద్రబాబు చేసిన మోసాన్ని కమలంపార్టీ నేతలు మరచిపోలేకుండా ఉన్నారు. నిజానికి పొత్తుల విషయం తేల్చాల్సింది నరేంద్రమోడీ మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడును కలవటానికి మోడీ అసలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఆజాదీ కీ అమృతోత్సవ్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేశంలోని అందరు సీఎంలను, ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇందులో భాగంగానే చంద్రబాబుకు కూడా ఆహ్వానం వచ్చింది.
సమావేశంలో పాల్గొన్న నరేంద్రమోడీ అందరితో మాట్లాడినట్లే చంద్రబాబుతో కూడా మాట్లాడారు. ఇంతోటిదానికే టీడీపీ, ఎల్లోమీడియా రెచ్చిపోయి మళ్ళీ టీడీపీ ఎన్డీయేలో చేరబోతోందట నానా రచ్చ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీతో పొత్తులేనిదే తనకు భవిష్యత్తులేదని టీడీపీ అంగీకరిస్తుండటమే. ఇదే విషయాన్ని జీవీఎల్, దేవధర్ మీడియాతో మాట్లాడుతు కొన్నిపార్టీల భవిష్యత్తు బీజేపీ మీదనే ఆధారపడున్నాయన్నారు. ఇక్కడ కొన్నిపార్టీల భవిష్యత్తు అంటే అదికేవలం టీడీపీ పార్టీ అని మాత్రమే గ్రహించాలి.
నిజానికి ఓట్లశాతాన్ని చూస్తే టీడీపీ గ్రాఫు ఎక్కడో పైనుంటే బీజేపీ గ్రాఫు పాతాళంలో ఉంది. అయినా టీడీపీని బీజేపీ నేతలు ఇంతగా చులకనగా మాట్లాడుతున్నారంటే అందుకు చంద్రబాబు స్వయకృతమనే చెప్పాలి. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు రాజకీయంగా క్లైమ్యాక్సని చెప్పాలి. తన క్లైమ్యాక్స్ విషాధంగా కాకుండా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నారు. తాను కోరుకుంటున్నట్లు జరగాలంటే బీజేపీ సహకారంలేకుండా సాధ్యంకాదని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకనే పొత్తుకోసం ఇంతగా వెంపర్లాడుతున్నారు. మరి క్లైమ్యాక్స్ ఎలాగుంటుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి