ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్ ను ఇచ్చింది.ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పై దుమారం రేగుతోంద. ఇదిఎవరికి వర్తిస్తుందన్న దానిపై రకకాల చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ని 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవో పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్ల కు పెంచుతూ ఇచ్చిన జీవో అందరికీ వర్తించదని ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.



రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు లో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. కేవలం వారికి మాత్రమే పదవీ విరమణ వయసును 62 ఏళ్ల కు పెంచినట్లు పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, వివిధ యూనివర్సిటీ ల్లో పని చేస్తున్న ఉద్యోగు లకు పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేస్తూ సంభందిత కంపెనీలు ఉత్వర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ సర్వీసు లో పనిచేసే వారికి మాత్రమే పదవీ విరమణ పెంచినట్లు తెలిపారు.



ఆయా సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఏపీ ఆర్థికశాఖ ప్రశ్నించింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధన లను ఉల్లంఘి స్తె కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబట్టుతున్నాయి. విశ్వ విద్యాలయాలు, ఎయిడెడ్‌, గురుకులాలు, సొసైటీలు, లైబ్రరీస్‌, పబ్లిక్‌ సెక్టార్‌ తదితర రంగాల ఉద్యోగులందరి కీ పదవీ విరమణ వయసు ను 62 ఏళ్ల కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.. మరి ఈ విషయం పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుం దో తెలియాల్సి ఉంది.. ఈ టాపిక్ చర్చలకు దారి తీసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: