ఆంధ్రప్రదేశ్ లో మరో ఒకటిన్నర సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీనియర్ రాజకీయ నాయకుడు మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఈ సారి కనుక టీడీపీ ఓడిపోతే ఇక ఏపీలో పార్టీ ఉనికి ఉండదన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీకి ఊపిరి పోయాలని శ్రమిస్తున్నారు చంద్రన్న. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఒక సంఘటన టీడీపీ ఆత్మస్తైర్యాన్ని మరియు విశ్వాసాన్ని ప్రశ్నిస్తోంది అని చెప్పాలి.

గతంలో 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతుగా నిలబడి పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పవన్ పార్టీ పెట్టి సెపరేట్ గా పోటీ చేయడం... ఇక చంద్రబాబు సైతం అధికారంలో ఉన్నాం కదా అని జనసేన పొత్తు కోసం ప్రయత్నించకపోవడంతో వైసీపీ చేతిలో ఘోరపరాజయాన్ని చవి చూసింది. దానితో టీడీపీ ఎన్నడూ లేని విధంగా చాలా బలహీనంగా మారిపోయింది. ఇక పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది కూడా పార్టీకి దూరంగా ఉండగా, కొందరు మాత్రం వైసీపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా ఎన్నికల పనులలో భాగంగా చంద్రబాబు ఈ సారి కూడా జనసేన తో కలిసి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాక్షత్కారమే మొన్న విజయవాడ నోవాటెల్ లో చంద్రబాబు వచ్చి పవన్ ను కలిసి ప్రెస్ మీట్ పేటి వైసీపీకి వ్యతిరేకంగా తన మద్దతును జనసేనకు తెలిపాడు. ఇక పవన్ సైతం బీజేపీ తో ఉన్న పొత్తు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.. మరోసారి టీడీపీ జనసేన మ్యాజిక్ రిపీట్ అయ్యి వైసీపీకి చెక్ పెడతారని తెలుగు తమ్ముళ్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: