ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహిస్తుంది.అయితే గురువారం నాడు ఈ ప్రాజెక్టు రికార్డు క్రియేట్ చేసి మరో మైలురాయిని చేరుకుంది.చాలా మంచి ప్రజాదరణ పొంది దూసుకుపోతున్న ఈ ఉచిత సామూహిక కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల్లో ఏకంగా 50 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసింది.జనవరి 18 వ తేదీన ముఖ్యమంత్రి kcr ఖమ్మంలో రెండవ దశ కంటి వెలుగు కార్యక్రామాన్ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఏకంగా 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,533 ప్రాంతాల్లో 1.50 కోట్ల మందికి సేవలను అందించాలని లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ అయిన కంటి వెలుగు రెండవ దశను జూన్ 15 వ తేదీ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా ఎంతగానో కృషి చేస్తుంది.ఇక ప్రస్తుతం స్క్రీనింగ్ చేసిన 50 లక్షల మందిలో దాదాపు 34 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు డాక్టర్లు గుర్తించడం జరిగింది.


అంటే దాదాపు 68 శాతం మందికి పైగా కంటి చూపులో ఎలాంటి అనారోగ్యాలు అనేవి గుర్తించలేదు. అయితే 13 లక్షల మందికి వైద్యం చాలా అవసరమని తేలింది. ఒకటి రెండు వారాల్లో స్క్రీనింగ్ క్యాంపులు ప్రాథమిక కంటి పరీక్షలు, ఆన్-సైట్ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ ఇంకా అలాగే సాధారణ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ అలాగే ప్రిస్క్రిప్షన్ గ్లాసుల పంపిణీని కూడా కవర్ చేస్తాయి.ఇప్పటి దాకా ఈ కంటి వెలుగు ప్రక్రియలో మొత్తం 9.5 లక్షల మంది రీడింగ్ గ్లాసెస్ పొందారు. చికిత్స అవసరమైన 16 లక్షల మందిలో ఏకంగా 6.5 లక్షల మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలు పొందినట్లు ఈ ప్రాజెక్టు గణాంకాలు చెబుతున్నాయి. టెక్నికల్ టీం రికమెండ్ చేసిన ప్రిస్క్రిప్షన్ గ్లాసులు జిల్లాల్లోని లబ్ధిదారులకు ఆశా ఇంకా ANMలు లాంటి స్థానిక క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణ నిపుణుల ద్వారా పంపిణీ చేయబడతాయి. ప్రజలకు కంటి చూపు సమస్యలను దూరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు ప్రాజెక్ట్ ఒక మహాయజ్ఞంలా విజయవంతంగా ముందుకు సాగటంపై లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: