డెమక్రసీ అంటే ఫర్ ది పీపుల్..బై ది పీపుల్..ఆప్ ది పీపుల్ అంటారు. మరి అమరావతి ఉద్యమాన్ని ఏ విధంగా వర్ణించాలి. అమరావతి ఉద్యమం అంటే బై ది మీడియా..ఫర్ ది మీడియా..ఆఫ్ ది మీడియా అనే వర్ణించాలేమో. మీడియా లేకపోతే అసలు అమరావతి ఉద్యమమే లేదు. ఎందుకంటే ఈ లేని ఉద్యమాన్ని ఉన్నట్లు, నడవని ఉద్యమాన్ని నడుస్తున్నట్లు జనాలందరినీ భ్రమల్లోకి నెట్టేప్రయత్నంచేస్తున్నది మీడియానే కాబట్టి. ఇక్కడ మీడియా అంట కేవలం ఎల్లోమీడియా అని మాత్రమే అర్ధం.
రాజధాని గ్రామాల్లోని మందడంలో అమరావతికి మద్దతుగా మీటింగ్ జరిగింది. అమరావతి ఉద్యమం మొదలై 1300 రోజులు దాటిందట అందుకనే ప్రతిపక్షాల్లోని అన్నీ పార్టీలతో నిర్వాహకులు ఒక మీటింగ్ పెట్టారు. విచిత్రం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎవరైతే అమరావతికి మద్దతుగా మ్యానిఫెస్టోలో హామీ ఇస్తారో వాళ్ళకి మాత్రమే అమరావతి జేఏసీ మద్దతిస్తుందని ప్రకటించారు. మరి అమరావతికి వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి కదా ఏ పార్టీకి మద్దతిస్తుంది జేఏసీ ?
ఇక్కడ విషయం ఏమిటంటే అసలక్కడ ఉద్యమం అంటు ఏమీ జరగటంలేదు. ఏదో పదిమంది కూర్చుని నాలుగు ప్లకార్డులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని తిడుతు ఫొటోలకు ఫోజులిస్తారు. దాన్ని ఎల్లోమీడియా ఉద్యమం అనిచెప్పి అచ్చేస్తుంటుంది. చాలా రోజుల నుండి జరుగుతున్నది ఇదే తంతు. పట్టుమని నాలుగురోజులు ఫొటోలు, వార్తలు రాకపోతే ఉద్యమం ముగిసిపోయినట్లే. ఒకదశలో అమరావతి డిమాండును చంద్రబాబునాయుడుతో పాటు చాలామంది ప్రతిపక్షనేతలు వదిలేశారు. దీంతో అయ్యేది కాదు పోయేదికాదని తీర్మానించుకున్నారు. ఎల్లోమీడియా కూడా వీళ్ళని పట్టించుకోలేదు. దాంతో అసలు అమరావతి అనేదాన్ని చుట్టుపక్కల జనాలు కూడా వదిలేశారు.
మళ్ళీ ఏమైందో ఏమో సడెన్ గా ఎల్లోమీడియా మళ్ళీ పట్టుకుంది. ఎల్లోమీడియాకు వార్తలు లేనపుడు, కోర్టులో విచారణ తేదీకి ముందు, పార్టీలన్నీ కలిసి జగన్ను తిట్టాలని అనుకున్నపుడు హఠాత్తుగా అమరావతి ఉద్యమం గుర్తుకొస్తుందంతే. 11వ తేదీన సుప్రింకోర్టులో అమరావతిపై విచారణ జరగబోతోంది. న్యాయస్ధానం టు దేవస్ధానమన్నారు. తర్వాత అమరావతి టు అరసవిల్లన్నారు. ఇపుడేమో దేవాలయాల సందర్శనంటున్నారు. ఇదంతా కూడా ఎల్లోమీడియా కోసం, ఎల్లోమీడియా వల్లే, ఎల్లోమీడియానే నడిపిస్తున్నట్లు అర్ధమైపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి