మిగిలిన రాష్ట్రాల నిర్ణయం ఎలాగున్నా పార్లమెంటు ఎన్నికలు, తెలంగాణా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై విపరీతమైన స్పెక్యులేషన్ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని పదేపదే ప్రచారం జరుగుతోంది. ఇటు కేసీయార్ అటు జగన్మోహన్ రెడ్డి ఇదే విషయమై సహచరులతో, ఎంఎల్ఏల సమావేశాల్లో మాట్లాడుతు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని చాలాసార్లు ప్రకటించారు. అయినా ముందస్తు ఎన్నికలపై ఎందుకింత రాద్దాంతం జరుగుతోంది ? ఎందుకంటే దీనికి ప్రతిపక్షాలే ప్రధాన కారణమని చెప్పాలి.
ఏపీ విషయమే తీసుకుంటే దాదాపు ఏడాది క్రిందంటినుండే ముందస్తు ఎన్నికలు ఖాయమంటు చంద్రబాబు విపరీతంగా ఊదరగొట్టారు. బహిరంగసభల్లో, పార్టీ సమావేశాల్లో, మీడియాతో ఎక్కడా మాట్లాడినా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నామని ఎన్నిసార్లు చెప్పారో, ఎన్ని ముహూర్తాలు ఫిక్స్ చేశారో లెక్కేలేదు. నిజానికి ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ మాత్రమే. అయినా విచిత్రంగా చంద్రబాబు చాలా ఆత్రపడ్డారు. పార్టీ క్యాడర్ జారిపోకుండా ఉండటం కోసమే చంద్రబాబు ముందస్తు జపం చేస్తున్నట్లు మంత్రులు చాలా సెటైర్లే వేశారు.
సరే ఇక విషయానికి వస్తే మొన్ననే నరేంద్రమోడీతో జగన్ భేటీ అయ్యారు. అప్పుడు కూడా ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చిందని సమాచారం. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే నిర్ణయాన్ని మోడీ పైనే జగన్ ఉంచారట. లోక్ సభకు మోడీ ముందస్తు ఎన్నికలకు వెళితే అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్ళటానికి తనకూ అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అంటే మోడీ నిర్ణయం మీదే జగన్ నిర్ణయం ఆధారపడున్నట్లు తెలుస్తోంది.
వ్యక్తిగతంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్ కు ఏమాత్రం లేదట. ఎందుకంటే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్ధాయిలో జనాలకు అందాలంటే తాను కూడా పూర్తిస్ధాయిలో ప్రభుత్వంలో ఉండాల్సిందే అని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పైగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం కూడా కనిపించటంలేదని జగన్ ఇప్పటికే క్యాబినెట్ సహచరులకు చెప్పిన విషయం తెలిసిందే. ముందస్తుకు వెళ్ళటానికి జగన్ మెంటల్ గా అయితే ప్రిపేర్డుగానే ఉన్నట్లు సమాచారం. మరి మోడీ ఏమంటారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి