దస్తగిరి, చంద్రబాబునాయుడుకు ఏమన్నా తేడా ఉందా ? స్ధాయిభేదమే కానీ  వాళ్ల వైఖరుల్లో తేడా ఏమీ కనిపించటంలేదు. దస్తగిరి అంటే వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు, చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అంతే తేడా. ప్రత్యర్ధుల విషయంలో ఇద్దరు సేమ్ టు సేమే.  తనకు ప్రాణహాని ఉందని చెప్పి, సీబీఐతో రికమెండ్ చేయించుకుని దస్తగిరి ఐదుగురు గన్ మెన్లను పెట్టుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రని, ఒకసారి దాడి జరిగిందని చెప్పి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిపించారు.





అయితే వీళ్ళేం చేస్తున్నారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఎదుటి వాళ్ళమీదకు కాలు దువ్వుతున్నారు. దస్తగిరి ఫోన్లుచేసి ఎవరిని పడితే వాళ్ళని బెదిరించటం, అమాయకులను కిడ్నాప్ చేయటం, పంచాయితీలు చేయటం ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాడు. తనకున్న గన్ మోన్ల కారణంగా ప్రత్యర్ధులపైన దౌర్జన్యం చేస్తున్నాడు. ఎదుటి వాళ్ళు తిరిగి దస్తగిరిని ఏమన్నా చేయాలంటే గన్ మెన్లు అడ్డుకుంటున్నారు. లేదా గన్ మెన్లను చూసి భయపడుతున్నారు.





అంటే ప్రభుత్వం కల్పించిన భద్రతను దస్తగిరి పూర్తిగా దుర్వినియోగంచేస్తున్నాడు. ఈ విషయమై పోలీసుల నుండే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఇక చంద్రబాబు విషయం కూడా అలాగే ఉంది. తనకున్న జడ్ ప్లస్ కేటగిరిని అడ్డంపెట్టుకుని ప్రత్యర్ధులపైకి తన నేతలు, క్యాడర్ను ఉసిగొల్పుతున్నారు. పుంగనూరు అల్లర్లలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. తన చుట్టూ బ్లాక్ క్యాట్ కమేండోలను అడ్డంపెట్టుకుని మైకులో పోలీసులు, వైసీపీ నేతలు, క్యాడర్ మీదకు చంద్రబాబు తన మద్దతుదారులను రెచ్చగొట్టిన విషయం వీడియోల్లో స్పష్టంగా కనబడింది.





చంద్రబాబు కూడా తనకిచ్చిన భద్రతను దుర్వినియోగం చేస్తున్నారనే అనిపిస్తోంది. తన మద్దతుదారులను సంయమనం పాటించాలని చెప్పాల్సిందిపోయి దాడులు చేయమని రెచ్చగొట్టడం ఏమిటో అర్ధంకావటంలేదు. పోలీసులకు ఒక రూటుమ్యాపిచ్చి తాను మరో రూట్లో ప్రయాణం చేయాలని అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. అంటే రూటుమార్పిడి కారణంగా ఏమన్నా జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టేయటమే చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. దస్తగిరికైనా చంద్రబాబుకైనా కేంద్రప్రభుత్వం భద్రత కల్పించింది వాళ్ళపైన ఎవరు దాడులు చేయకుండానే కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళపైన దాడులు చేయటానికి కాదు.




మరింత సమాచారం తెలుసుకోండి: