తెలుగుదేశం తీసుకొచ్చే ఎకో సిస్టంలో పవన్ కల్యాణ్ కూడా చేరిపోతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పోస్టులను పవన్ తెగ ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. జగన్ పై 38 కేసులు ఉన్నట్లు పవన్ టీడీపీ నాయకులు ఆరోపించినట్లే మాట్లాడుతున్నారు. అసలు జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటున్నారు వైసీపీ నేతలు. జగన్ పై సీబీఐ కేసులు 11, ఈడీ కేసులు 7 ఉన్నాయి.


అంటే మొత్తం 18 కేసులు ఉన్నాయి. మిగతా కేసులు అన్ని ధర్నాలు చేశారని నిబంధనలు ఉల్లంఘించారని , ఎయిర్ పోర్టుకు రానివ్వని సమయంలో చేసిన ధర్నా విషయంలో పెట్టిన కేసులు. వీటన్నింటి గురించి కూడా లెక్కలు వేసుకుని జగన్ పై 38 కేసులు ఉన్నాయని సంఖ్య పెంచి చెబుతున్నారు. టీడీపీ తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అనే మాదిరిగా తయారయ్యారు. అయితేే పవన్ మీద కూడా ఇలాంటి నిరసనలు, ధర్నాలు పెడుతున్నారు. చంద్రబాబు మీద కూడా 100 కు 80 కేసులు ఉంటాయి.


ధర్నాలు, నిరసనలు చేసిన విషయాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లలో నాయకుల పేర్లు అలానే ఉంటాయి. కానీ వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తారు. కానీ కేసు అలాగే ఉంటుంది. కేసు ఎప్పుడు పూర్తిగా కొట్టేస్తారో అప్పుడే కేసు లేకుండా పోతుంది. చిన్నప్పటి నుంచి జగన్ ను చూశాను అని పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటారు. జగన్ యాటిట్యూట్ చూస్తున్నాను అని పవన్ అంటున్నారు.


అయితే చిరంజీవి కుటుంబంలో పవన్ కల్యాణ్ ఒక్కరే అగ్రిసెవ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జగన్ విషయంలో ప్రతిదీ ప్రశ్నిస్తాను అని చెప్పే పవన్ కల్యాణ్ చంద్రబాబు విషయానికి వచ్చే సరికి మౌనంగా ఉండటమనేది మాత్రం సరైనది కాదని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఒకవైపు న్యాయం అని చూపించడం మరో వైపు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించడంలోనే లోపం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: