అయితే నారా భువనేశ్వరీ చంద్రబాబు అరెస్టుకు సంఘీభావంగా బస్సు యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ నాయకులను పరామర్శించడం, తర్వాత బహిరంగ సభలను పెట్టడం అక్కడ మాట్లాడటం లాంటి కార్యక్రమాలు చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పర్మిషన్ విషయంపై చంద్రగిరిలో పోలీసులను విలేకర్లు ప్రశ్నలు అడిగితే మాకు నారా భువనేశ్వరీ బహిరంగ సభకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు.
దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. పోలీసులకు తాము లేఖ రాశామని అంటున్నారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలకు అనుమతులు తీసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే.అయితే కేవలం లేఖ రాసి అనుమతి ఇవ్వలేదని అనడం సరికాదు. దీన్నే బూచిగా చూపి వైసీపీ సర్కారు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పేందుకు, ప్రజలను రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుంది.
ఏ రాజకీయ నాయకుడైనా బస్సు యాత్ర, తర్వాత సభ పెట్టుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన పోలీసులను పర్మిషన్ అడగడం అనేది పద్ధతి. ఆ తర్వాత పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప పర్మిషన్ తప్పకుండా ఇస్తారు. అలాంటిది పర్మిషన్ విషయంలో లేఖ రాసి దాన్నే పర్మిషన్ గా తీసుకోవాలని చూడటం టీడీపీ నాయకులకే చెల్లింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి