తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకొని మరి ఈసారి ఎన్నికలలో దిగబోతున్నాయి.ముఖ్యంగా రెండు పార్టీలు కూడా కలిసిగా పనిచేస్తున్నప్పటికీ అక్కడక్కడ టిడిపి జనసేన మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరితో పాటు బిజెపి పార్టీని కలుపుకోవాలని పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వైసిపి పార్టీని ఎదుర్కోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే ఈ పార్టీలన్నిటిలో ఇంకా సీట్ల విషయంలో అసలు సర్దుబాటే జరగలేదు.. ముఖ్యంగా పొత్తులలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని ఎలా పంచుకోవాలని విషయం పైన కాపు నేతలు చాలా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


సీఎం పదవిని కూడా పంచుకోవాలంటూ కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు.. ఇలాంటి తరుణంలోనే టిడిపిలో చాలామంది తెలియజేస్తున్న మాట ఏమిటంటే రెండు నెలలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో రెండు నెలలు సీఎం గా ఉన్న.. మరి లోకేష్ బాబు పరిస్థితి ఏంటి అంటూ తెలుపుతున్నారు. సీఎం కావాలని కోరికతో లోకేష్ ఎన్నో రకాల సభలను సైతం నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. అంతేకాకుండా ఇటీవలే శంఖారావం అనే పేరుతో ఒక సభలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని సభలలో సీఎం లోకేష్ అంటూ కూడా పలు రకాల నినాదాలు చేశారు. దీన్నిబట్టి చూస్తే లోకేష్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. అయితే ఒకవేళ టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల చివరిలో నైనా లోకేష్ ని సీఎం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే కాపు నేతలు ఎంతటి డిమాండ్ చేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు మాత్రం సీఎం సీటు ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబుకు ఇష్టం లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ బలహీనపడుతుందని చంద్రబాబు భావన..


కూటమిలో భాగంగా ఒకవేళ టిడిపికి ఎక్కువ సీట్లు వస్తే చంద్రబాబు ఈ కూటమినీ పక్కన పెట్టేసి సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే అవకాశాలు కూడా ఉంటాయి.. ఇలా చేస్తే చివరిలో తన కుమారుడిని సీఎం గా చేసే అవకాశం ఉంటుంది చంద్రబాబుకు.. కొంతమంది లోకేష్ అభిమానులు కూడా ఆయనని సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. అయితే ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలిస్తేనే తప్ప గెలవకపోతే ఇలాంటి ఆశలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: